Home » Medaram Jatara
తిరుమలలో వెంకన్న, బెజవాడ దుర్గమ్మకు, యాదగిరీశుడికి, బాసరలో సరస్వతీ అమ్మవారికి.. ఇలా ప్రధాన ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు భక్తులు ఏటా సమర్పించుకుంటున్న బంగారం ఎంత?
మేడారం అభయారణ్యంలో సుడిగాలుల ప్రభావానికి 205 హెక్టార్లలో వృక్ష సంపద ధ్వంసమైన ఘటనను మరువక ముందే ఏటూరునాగారం మండలంలోనూ అదే తీరులో భారీగా వృక్షాలు నేలకూలాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి.
ములుగు జిల్లా వనదేవతల సన్నిధి మేడారంలో మరో విషాదం చోటుచేసుకుంది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సంపత్ (38) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతల ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య(50) శనివారం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ/రిజర్వాయర్ నిర్మిస్తామని ఇంతకాలం పట్టుబట్టిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఒక మెట్టు దిగింది.
వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది.
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం(సమ్మక్కసాగర్) బ్యారేజీ నీటి వినియోగం/లభ్యతపై తాజాగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలంగాణను కోరింది. ఈమేరకు నీటిపారుదల శాఖ అధికారులకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
వనదేవతల గద్దెల వద్ద పూజారులు ధర్నా చేశారు. వరంగల్లోని ధార్మిక భవనానికి సమ్మక్క సారలమ్మల పేరు పెట్టాలని, రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ఆదాయం నుంచి మూడో వంతు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడారం దేవస్థానం ప్రధాన గేటు ఎదుట అర్చక సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన పూజారి కొక్కెర రమేశ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు.