Home » Old City
ఉషారాణి, మోహన్ లాల్ దంపతులు గత కొంత కాలంగా బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్బంగా ముందుగానే టాపాసులు తీసుకువచ్చి ఇంట్లో నిలువ ఉంచుకున్నారు. రాత్రి ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిరి టపాసుల్లో పడడంతో మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు పెరిగి ఇంట్లో ఉన్న బాణా సంచా మొత్తం పేలిపోయింది.
మూసీనదికి పూర్వ వైభవాన్ని కల్పించాలని కంకణబద్ధమైన రేవంత్ సర్కారు.. పక్కా ప్రణాళికతో ముం దుకు సాగుతోంది. ‘ఆపరేషన్ మూసీ’కి సన్నాహాలు చేస్తోంది.
ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(MGBS-Chandrayanagutta) వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రోమార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణను ప్రారంభించారు. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి దాదాపు 1200 వరకు ఆస్తులు అవసరం ఉన్నాయి.
‘‘పాతబస్తీ ఏమైనా ఒవైసీ జాగీరా?’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై మండిపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.
‘‘మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా పాతబస్తీలో మెట్రో నిర్మాణాన్ని చేపడతాం. 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం (టీఎస్ న్యాబ్) పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తనను చితకబాది అక్రమ కేసు బనాయించారని...
హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పీఎస్‌కు కూత వేటు దూరంలో ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న ప్రియురాలిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
పాతబస్తీ బహదూర్‌పూర్‌లో డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సయ్యద్ అనే వ్యక్తి తన భార్య ఉన్నీసాలేతో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.