Share News

Crime News: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

ABN , Publish Date - Jun 18 , 2024 | 12:47 PM

హైదరాబాద్: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పీఎస్‌కు కూత వేటు దూరంలో ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న ప్రియురాలిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

Crime News: పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

- హైదరాబాద్ పాతబస్తీలో దారుణం

- యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

- దాడి అనంతరం పరారీలో నిందితుడు

- స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగింత..


హైదరాబాద్: పాతబస్తీ (Old City) ఛత్రినాక పోలీస్ స్టేషన్ (Chatrinaka Police Station) పరిధిలో దారుణం జరిగింది. పీఎస్‌కు కూత వేటు దూరంలో ప్రియురాలి (Girlfriend)పై ప్రియుడు (Boyfriend) కత్తిపీటతో (Knife) దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్న ప్రియురాలిని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రియుడు దాడి చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..


బాధితురాలు శ్రవ్య (28)కు గతంలో వివాహమైంది. ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో భర్తతో విడాకులు తీసుకుంది. శ్రవ్య కాస్మోటిక్స్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కట్ చేస్తే.. శ్రావ్యకు స్కూల్ డేస్ నుంచే గౌలిపురకు చెందిన మణికంఠతో పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు.. గత కొద్ది రోజులుగా శ్రావ్య ప్రియుడుని దూరం పెట్టింది. అది తట్టుకోలేక మణికంఠ మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రావ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసి కత్తిపీటతో తలపై మోదీ, ఆపై గొంతు కోసి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

లోకేష్ ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన

ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు

ఏలూరు జిల్లా: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..

అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 18 , 2024 | 12:49 PM