Home » South Central Railway
సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) శ్రీధర్ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.
Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దసరా, చాత్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల కోసం దాదాపు 770 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్లలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తోందని, గత నాలుగు (ఏప్రిల్-జూలై) నెలల్లో రూ.6,984 కోట్ల ఆదాయాన్ని సాధించిందని జీఎం అరుణ్‌కుమార్ జైన్(GM Arun Kumar Jain) తెలిపారు.
కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సైతం జరుగనున్నాయి. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సైతం అదే రోజు జరుగనున్నాయి.
Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.
వేసవి ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్-దానాపూర్(Secunderabad-Danapur) మధ్య 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇన్నాళ్లు రిజర్వ్ రైలు టికెట్లను మాత్రమే ఫోన్లో బుక్ చేసే సదుపాయం ఉండేది. అయితే రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అన్ రిజర్వ్ సీట్లకు కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో విస్తరించి ఉన్న 31 కౌంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా క్యూఆర్ కోడ్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు.