Share News

Trains: పలు రైళ్లకు నంబర్ల మార్పు.. మార్చి 1 నుంచి అమల్లోకి

ABN , Publish Date - Nov 19 , 2024 | 07:26 AM

సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ) శ్రీధర్‌ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను కేటాయించారు.

Trains: పలు రైళ్లకు నంబర్ల మార్పు.. మార్చి 1 నుంచి అమల్లోకి

హైదరాబాద్‌ సిటీ: సాధారణ నిర్వహణ కారణాలతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో నడుస్తున్న 10 రైళ్ల నంబర్లను మారుస్తున్నట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ) శ్రీధర్‌ తెలిపారు. విశాఖపట్నం-కడప(Visakhapatnam-Kadapa) మార్గంలో 17488/17487 నంబర్లతో నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ కు 18521/18522 నంబర్లను, విశాఖపట్నం- గుంటూరు(Visakhapatnam-Guntur) మధ్య 22701/22702 నంబర్లతో నడిచే ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్ కు 22875/22876 నంబర్లను, భువనేశ్వర్‌-రామేశ్వరం మార్గంలో 20896/20895 నంబర్లతో నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‏కు కొత్తగా 20895/20896 నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ప్రేమ.. పెళ్లి.. ఆపై హత్య


city3.2.jpg

అలాగే.. భువనేశ్వర్‌-పుదుచ్చేరి(Bhubaneswar-Puducherry) మార్గంలో 12898/12897 నంబర్లతో నడిచే ఎక్స్‌ప్రె్‌సకు 12897/12898, భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌ మార్గంలో 12830/12829 నడిచే ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా 12829/12830 నంబర్లను కేటాయించారు. మార్పు చేసిన రైళ్ల నంబర్లు మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 07:27 AM