Diwali 2024: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్రయోగం
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:42 AM
Telangana: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 30: దసరా పండుగ హడావుడి ముగిసింది.. ఇప్పుడు దీపావళి (diwali Festival) సందడి నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్ 31న దీపావళి పండుగను ప్రజలంతా ధూంధాంగా జరుపుకోనున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసుల మోత మోగించనున్నారు. దీపావళిని పురస్కరించుకుని స్కూళ్లకు కూడా సెలవు కావడంతో ఈ పండుగను తమ సొంత గ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడువుగా సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
AP News: రైల్వే ఉద్యోగిపై సైబర్ నేరగాళ్ల పంజా
అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (Secundrabad Railway Station) కూడా ప్రయాణికుల (Passengers) సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైలు ఎక్కే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఈసారి సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ప్రత్యేక చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి పండుగ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్పెషల్ ట్రైన్లతో పాటు రైల్వే స్టేషన్లలో పలు జాగ్రత్త చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఈరోజు (బుధవారం) నుంచి క్యూలైన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే. జనరల్ బోగీలు ఆగే చోట ప్లాట్ ఫామ్‌లపై క్యూ లైన్లను ఏర్పాటు చేసింది.
Choti Diwali 2024: చోటి దీపావళి వేళ.. ఇలా..
తోపులాట లేకుండా లైన్‌లో నిల్చొని ప్రశాంతంగా వెళ్లేందుకు వీలుగా క్యూలైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలి విడతగా విజయవాడ మార్గంలోని రైళ్లలో క్యూలైన్ విధానాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అమలులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త విధానంపై ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి హడావుడి, తోపులాట లేకుండా ప్రశాంతంగా క్యూలైన్లలో నిల్చుని ట్రెయిన్‌లోకి వెళ్లవచ్చని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు
Read Latest Telangana News And Telugu News