Share News

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - May 07 , 2024 | 06:49 PM

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది. 13, 14 తేదీల్లో.. సికింద్రాబాద్-కాకినాడ, కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేర ట్రైన్ సర్వీస్‌లను రన్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎస్‌సీఆర్.


మే 13వ తేదీన పోలింగ్..

లోక్‌సభ ఎన్నికల్లో 4 విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. ఏపీకి చెందిన చాలా మంది ఓటర్లు హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని పలు చోట్ల ఉన్నారు. దీంతో వారి ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికు రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. సికింద్రాబాద్-కాకినాడ స్పెషల్ ట్రైన్స్ నడిపేందుకు సిద్ధమైంది.

For More Telangana News and Telugu News..

Updated Date - May 07 , 2024 | 06:49 PM