Home » Womens Reservation Bill
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024 జనాభా లెక్కల తర్వాత మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక 'మహిళా రిజర్వేషన్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారంనాడు ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు గొప్పదేనని, అయితే రిజర్వేషన్లను తక్షణం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అసలు ఎప్పట్నించి అమలు చేస్తారో కూడా ఎవరికీ తెలియదని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు (Women Reservation Bill) రాజ్యసభ (Rajya Sabha) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఓబీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, 99 మంది ప్రభుత్వ కార్యదర్శుల్లో ముగ్గురే ఓబీసీలు ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. దేశాన్ని నడుపుతున్నది ప్రభుత్వమే కానీ, సెక్రటరీలు కాదంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. కొత్త పార్లమెంటులోని లోక్‌సభలో మొదటిగా ఆమోదం పొందిన బిల్లు ఇదే కావడం విశేషం.బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీలు ఓటు వేయగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు.
కొన్ని పార్టీలకు మహిళా రిజర్వేజన్ బిల్లు రాజకీయ అంశం కావచ్చేమో కానీ, బీజేపీకి ఎంతమాత్రం కాదని, తమ పార్టీకి, తమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ బిల్లు మహిళా సాధికారతకు చెందిన అంశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త శకానికి ఆరంభమన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చలో ఆయన పాల్గొంటూ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
మహిళా సాధాకారతకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సానుకూలమేనని, పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించిన దేశంలోని తొలి పార్టీ బీజేపీయేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చేందుకు వడోదర జాతీయ సదస్సుల్లో బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.