Home » Year Ender 2024
నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక కేసు వెలుగులోకి రావడం చూస్తున్నాం. కొన్ని నేరాలు దేశాన్నే అతాకుతలం చేసిన ఘటనలను కూడా చూశాం. కోల్‌కతా అత్యాచార ఘటన సహా అనేక కేసులు ప్రజలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ ఏడాది ఆగస్టు 31న సుమారు 15 కిలో మీటర్ల వ్యవధిలో 200 హెక్టార్లలో 50 వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టం అయ్యాయి. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది.
రోడ్‌షోలు.. హామీలు.. ప్రలోభాలు.. బెదిరింపులు.. అయినా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి. జగన్ పార్టీకి తీవ్ర భంగపాటును 2024 మిగిల్చింది. చంద్రబాబు సారధ్యంలోని కూటమికి అనూహ్యమైన విజయాన్ని అందించింది.
Year Ender 2024: 2024 ఏడాది కాంగ్రెస్ పార్టీకే కాదు... ప్రియాంక గాంధీకి సైతం కలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకొంది. ఇక వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంకగాంధీ గెలుపొందారు.
Year Ender 2024: ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్లో జరిగిన కాల్పుల్లో 75 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో 60 శాతం మంది విదేశీయులేనని తెలిపారు.
2024లో భారతదేశంలో విలాసవంతమైన గృహాల మార్కెట్ విస్తృతంగా అభివృద్ధి చెందింది. ప్రధానంగా ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్ వంటి నగరాల్లో పలువురు ఆసక్తి చూపడంతో కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024లో భారతదేశంలోని ప్రధాన బ్యాంకులు ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధానంగా నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) పెరగడం, రుణ వసూలు సమస్యలు, నకిలీ లావాదేవీలు, అవినీతి కారణంగా నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో ఏయే బ్యాంకులు నష్టాలను ఎదుర్కొన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మోదీ నినాదం 400+ నినాదం విఫలమవడానికి రాహుల్ గాంధీయే కారణమని కాంగ్రెస్ గట్టిగా చెప్తున్నది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని ప్రజలకు వివరంగా చెప్పగలిగారని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.