Home » Telangana
టీపీసీసీ పదవిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... బీసీ నేతకు పీసీసీ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్‌కు ఈ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణలో బారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు. ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాటలను పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత జి .దేవిప్రసాద్ తెలిపారు. పోలీసు అధికారుల పట్ల బీఆర్ఎస్కు గౌరవం ఉందని అన్నారు. ఈరోజు(శనివారం) తెలంగాణ భవన్లో దేవిప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఖైరతాబాద్ మహాగణపతిని సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు(శనివారం) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోందని తెలిపారు.
బయోడైవర్సిటీ(Biodiversity) ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వా్న్ని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...
వర్షాలు.. ముంపు ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వరద నీటి నిర్వహణ మెరుగుదలపై దృష్టి సారించింది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూనే, ఆపరేషన్ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహా గణపతి పూజ అనంతరం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు
వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్ గణేష్(Balapur Ganesh)తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు.
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావని, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.