KCR Tribute: కైకాల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

ABN , First Publish Date - 2022-12-23T15:12:32+05:30 IST

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.

KCR Tribute: కైకాల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (Senior Actor Kaikala Satyanarayana) భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR)నివాళులర్పించారు. కొద్దిసేపటి క్రితమే ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసానికి సీఎం చేరుకున్నారు. కైకాల పార్థివదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు. కైకాల కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం... కైకాల సత్యనారాయణ మృతిపై విచారం వ్యక్తం చేశారు. కైకాల విలక్షణ నటుడన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలిపారు. కైకాల సత్యనారాయణ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానభూతిని తెలియజేశారు.

Updated Date - 2022-12-23T15:24:37+05:30 IST