Chandrababu news: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2023-09-26T21:32:44+05:30 IST

చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బుధవారం (రేపు) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Chandrababu news: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బుధవారం (రేపు) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి ఎస్‌వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని కోర్ట్ తెలిపింది. 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదని హైకోర్టు పేర్కొంది.


సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగం జరిగిందని హైకోర్టు పేర్కొంది. ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా.. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T21:32:44+05:30 IST