Share News

AP NEWS: సహకార సంఘం భవనాన్ని కూల్చిన రెవెన్యూ, ఆలయ అధికారులు

ABN , First Publish Date - 2023-12-06T20:11:06+05:30 IST

కాణిపాకంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనాన్ని రెవెన్యూ, ఆలయ అధికారులు కూల్చివేశారు. భవనం కూల్చివేతపై స్థానికులు, రైతులు ,టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP NEWS: సహకార సంఘం భవనాన్ని కూల్చిన రెవెన్యూ, ఆలయ అధికారులు

చిత్తూరు : కాణిపాకంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనాన్ని రెవెన్యూ, ఆలయ అధికారులు కూల్చివేశారు. భవనం కూల్చివేతపై స్థానికులు, రైతులు ,టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పేరున్న శిలాఫలకం ఉందన్న ఒకే ఒక్క కారణంతో పాడిరైతులకు దశాబ్దాల కాలంగా ఉపయోగడిన భవనాన్ని అధికారులు కూల్చివేశారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా అక్కడి గ్రామస్తులకు ఎంతో సౌకర్యంగా ఉన్న భవనాన్ని కోర్టు అనుమతితో కాణిపాకం దేవస్థానం ఈఓ కూల్చివేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. భవనం కూల్చివేతపై పూతలపట్టు టీడీపీ ఇన్‌చార్జ్ మురళీమోహన్ రెవెన్యూ అధికారులను, పోలీసులను నిలదీశారు. మార్గదర్శకాల ప్రకారం కోర్టు అనుమతి తీసుకొని భవనం కూలుస్తున్నామని ఈవో చెప్పారు. కోర్టు అదేశాలను గౌరవించి భవనం కూల్చివేతను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎకరాల కొద్ది పంచాయతీ భూములను వైసిపీ నాయకులు కబ్జా చేసి, దేవస్థానం ఈఓ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారం భవనాలు కట్టి అద్దెలు వసూలు చేస్తున్న విషయం ఈఓకు కనిపించలేదా అని రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-12-06T20:11:07+05:30 IST