Share News

AP High Court: హైకోర్టులో సీఎం జగన్ వేసిన పిటిషన్‌కు ఎన్ఐఏ కౌంటర్

ABN , First Publish Date - 2023-11-28T19:13:52+05:30 IST

ఏపీ హైకోర్టు ( AP High Court ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) వేసిన పిటిషన్‌కు ఎన్ఐఏ ( NIA ) కౌంటర్ దాఖలు చేసింది. గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసులో కుట్ర దాగి ఉందని నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్‌పై విచారణ చేపట్టి ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది.

AP  High Court: హైకోర్టులో సీఎం జగన్ వేసిన పిటిషన్‌కు ఎన్ఐఏ కౌంటర్

అమరావతి : ఏపీ హైకోర్టు ( AP High Court ) లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) వేసిన పిటిషన్‌కు ఎన్ఐఏ ( NIA ) కౌంటర్ దాఖలు చేసింది. గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసులో కుట్ర దాగి ఉందని నాలుగేళ్ల తర్వాత సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టి కొట్టివేసింది. దీనిపై తాజాగా హైకోర్టు మెట్లెక్కి జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం నాడు ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ పేర్కొంది. మరింత లోతైన దర్యాప్తు అవసరం లేదని కౌంటర్‌లో ఎన్ఐఏ మరోసారి పేర్కొంది. కౌంటర్‌లో నిందితుడు ఎయిర్ పోర్టులో వ్యవహరించిన తీరుపై ఎన్ఐఏ సమగ్రంగా వివరించింది. దాడికి ముందు కోడి కత్తి శ్రీను జగన్ వద్దకు వచ్చి 160 సీట్లు వస్తాయని చెప్పిన తర్వాతే దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసుపై సాధారణ విచారణ కొనసాగుతుందని లోతైన విచారణ ను ఇప్పటికే పూర్తయినందున మరోసారి విచారణ అవసరం లేదని ఎన్ఐఏ తెలిపింది.

Updated Date - 2023-11-28T19:34:08+05:30 IST