Pulivendula: దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు.. పులివెందులలో టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2023-04-25T16:57:18+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు.

Pulivendula: దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు.. పులివెందులలో టెన్షన్.. టెన్షన్

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి (Dastagiri) ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దస్తగిరికి ఉన్న భద్రతపై ఆరా తీశారు. ఏదైనా సమస్య వస్తే తెలియజేయాలని దస్తగిరికి అధికారులు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తెలియజేయాలని దస్తగిరికి సీబీఐ అధికారులు తెలిపారు.

మరోవైపు పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి (Kadapa MP Avinash Reddy) హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. అవినాష్‌ రెడ్డి కోసం అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాసేపటి క్రితమే అవినాష్ ప్రజాదర్బార్ కార్యక్రమానికి తరలివెళ్లారు. మరోవైపు పులివెందులలోనే సీబీఐ అధికారులు మకాం వేశారు. ఈ క్రమంలో అవినాష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనే టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.

హైదరాబాద్‌లో పరిస్థితి ఇదీ...

కాగా.. వివేకా కేసులో సీబీఐ అధికారులు (CBI Officials) దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు అంతర్గతంగా దర్యాప్తు చేపట్టారు. సీబీఐ విచారణను ఎదుర్కుంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈక్రమంలో సీబీఐ అధికారులు వ్యూహం మార్చి ఈ కేసులో కీలకంగా ఉన్న సాక్షులను విచారిస్తున్నారు. అవినాష్ రెడ్డికి సంబంధించి ఓ బంధువును సీబీఐ అధికారులు విచారించారు. అతడు ఎవరు అనేది కాసేపట్లో అధికారులు తెలియజేసే అవకాశం ఉంది. ఈనెల 30వరకు ఉన్న దర్యాప్తు సమయాన్ని జూన్ 30 వరకు సుప్రీం కోర్టు పొడిగించిన నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా ఉన్నా సాక్షాలను బయటకు తెచ్చేందుకు సీబీఐ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప, పులివెందులలో ఒక బృందంగా ఉండగా, మరో బృందం హైదరాబాద్‌లో, ఇంకో బృందం ఢిల్లీలో ఉండి విచారణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కోర్టులో వస్తున్న జడ్జ్‌మెంట్ కాపీలను పరిశీలిస్తూ వాటికి అనుకూలంగా సీబీఐ ధర్యాప్తును ముందుకు తీసుకువెళ్తోంది.

అవినాష్‌ రెడ్డి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో స్పష్టత వచ్చినప్పటికీ హైకోర్టులో మాత్రం పెండింగ్‌లో ఉంది. అయితే ముందస్తు బెయిల్‌ను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తారా లేక.. అంతకంటే ముందే అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో హైకోర్టులో జరిగిన విచారణలో అవినాష్‌‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా అరెస్ట్ చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆరు రోజుల పాటు సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకావాల్సి ఉండగా.. కేవలం నాలుగు రోజులు మాత్రమే హాజరయ్యారు. విచారణ సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇచ్చిన వాంగ్మూలాన్ని సేకరించారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ అనుకూలమైన సమాచారం వచ్చిందా.. రాని పక్షంలో మరోసారి కస్టడీకి తీసుకున్న విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది.శా

Updated Date - 2023-04-25T16:59:11+05:30 IST