Buddha Venkanna: జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు..

ABN , First Publish Date - 2023-04-26T11:30:21+05:30 IST

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Buddha Venkanna: జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు..

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అమ్మకి అన్నం పెట్టనోడు... చిన్నమ్మ చేతికి బంగారు గాజులు చేయించిన సామేతేలా ముఖ్యమంత్రి పరిస్థితి ఉందన్నారు. అరెస్టయి జైలులో ఉంటే షర్మిల (Sharmila)ను జగన్ పరామర్శించలేదని, సొంత తల్లిని, చెల్లిని పట్టించుకోని వ్యక్తి అని విమర్శించారు.

సొంత తోడబుట్టిన సోదరి షర్మిలను పట్టించుకోని జగన్... రాష్ట్ర ఆడపడుచులకు అన్నగా ఉంటాననడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. మరో చిన్నాన్న వివేకా కూతురు సునీతపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేస్తుంటే జగన్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు (Chandrababu)పై చేసిన తప్పుడు ఆరోపణలు, జగన్ రిప్రరిజెంటేషన్‌పై సీఐడీ అధికారులు సీఎంను విచారించాలని డిమాండ్ చేశారు.

గతంలో షర్మిల అరెస్టు‌పై ప్రధాని మోదీ ట్వీట్ (PM Modi Tweet) చేశారని, కనీసం ముఖ్యమంత్రి సోదరి షర్మిలను, తల్లి విజయమ్మ, ఆమె కుటుంబాన్ని ఫోన్‌లో కూడా పరామర్శించలేదని బుద్దా వెంకన్న విమర్శించారు. జగన్ కోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని అన్నారు. వివేకా హత్య కేసులో చట్టం తనపని తాను చేసుకుంటోందని మంత్రులు మాట్లాడుతున్నారని.. అంటే దానర్థం జగన్ ఎపుడు అరెస్ట్ అవుతారా? అని మంత్రులు ఎదురు చూస్తున్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో విజయమ్మను అవమానించారని, అయినా ఆయనను జగన్ మంత్రిగా పక్కన పెట్టుకున్నారన్నారు. జగన్.. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు, సిద్దాంతాలకు వ్యతిరేకి అని విమర్శించారు. సీబీఐ కూడా సీఐడీలా సీఎం జగన్ చేతుల్లో ఉంటే ఈపాటికే వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేయించేవారని బుద్దా వెంకన్న అన్నారు.

Updated Date - 2023-04-26T11:31:00+05:30 IST