Share News

Organ Donation: ఆయుష్ ఆస్పత్రిలో అవయవాల దానం

ABN , First Publish Date - 2023-10-28T16:15:59+05:30 IST

అత్యవసరంగా అవయవాలు అవసరమైన వ్యక్తులకు మార్పిడి చేయడానికి విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రి ( Ayush Hospital ) వైద్యులు మహత్తర కార్యక్రమానికి సకల్పించారు. ఆస్పత్రిలో ఉన్న గుండె, కిడ్నీ, లివర్‌ శరీర భాగాలను వివిధ ప్రాంతాలకు వైద్యులు తరలిస్తున్నట్లు ఆయుష్ ఆస్పత్రి వైద్యులు వై. రమేష్ బాబు తెలిపారు.

Organ Donation: ఆయుష్ ఆస్పత్రిలో అవయవాల దానం

విజయవాడ: అత్యవసరంగా అవయవాలు అవసరమైన వ్యక్తులకు మార్పిడి చేయడానికి విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రి ( Ayush Hospital ) వైద్యులు మహత్తర కార్యక్రమానికి సకల్పించారు. ఆస్పత్రిలో ఉన్న గుండె, కిడ్నీ, లివర్‌ శరీర భాగాలను వివిధ ప్రాంతాలకు వైద్యులు తరలిస్తున్నట్లు ఆయుష్ ఆస్పత్రి వైద్యులు వై. రమేష్ బాబు తెలిపారు. గారపాటి జయప్రకాష్ అనే 22యేళ్ల యువకుడు తలకు గాయం‌ కావడంతో ఆయుష్షు ఆస్పత్రికి వచ్చారు. బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం అందజేశారు. జయప్రకాశ్ కుటుంబ సభ్యులు కూడా జీవన్ దాన్ కింద అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. తిరుపతి పద్మావతి ఆస్పత్రికి గుండెను పంపుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఒక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి, మరో కిడ్నీ, లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం ఇందుకోసం పని చేసింది. గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి వివిధ ఆస్పత్రులకు అవయవాలను తరలిస్తున్నారు. అవయవ దానాలపై ప్రజలు కూడా ఆలోచించాలని ఆయూష్ వైద్యులు తెలిపారు. మనం పోయినా... నలుగురికి ప్రాణాలు పోసే ఆలోచన చేయాలని ప్రజలను ఈ సందర్భంగా కోరుతున్నామని వైద్యులు చెప్పారు. మూఢూ నుంచి నాలుగు గంటల్లో విజయవాడ నుంచి తిరుపతి కి గుండెను తరలిస్తామని ఆయుష్ ఆస్పత్రి వైద్యులు వై. రమేష్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-28T16:15:59+05:30 IST