Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

ABN , First Publish Date - 2023-08-24T16:34:18+05:30 IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఏకాంత భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలొ లోకేష్‌తో సమావేశం అయ్యారు.

Vijayawada: నారా లోకేష్‌తో వంగవీటి రాధా ఏకాంత భేటీ

విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha) ఏకాంతంగా భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) విరామ సమయంలొ లోకేష్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటీవల యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా వరసగా పాల్గొంటున్నారు. కాగా రాధా లోకేష్ భేటీపై రాజకీయ వర్గాల్లో సర్వత్ర ఆసక్తి నెలకొంది.

కాగా బాపులపాడు మండలం, రంగన్నగూడెంలో నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ (High Tension) వాతావరణం చోటు చేసుకుంది. లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ (YCP Banner) ఏర్పాటు చేసింది. బ్యానర్‌పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు. వైసీపీ నాయకులతో ఫోటో వేయడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పట్టాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు తిరగబడటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు సైతం వైసీపీ కవ్వింపు చర్యలన్ని నియంత్రించలేదు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసుల్ని మోహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2023-08-24T16:34:18+05:30 IST