Adani Group: ఆర్ఎఐఎన్ఎల్ ప్రైవేటీకరణపై స్పష్టత

ABN , First Publish Date - 2023-08-03T23:47:59+05:30 IST

ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు.

Adani Group: ఆర్ఎఐఎన్ఎల్ ప్రైవేటీకరణపై స్పష్టత

విశాఖపట్నం(Visakhapatnam): ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌(Steel plant)కు, అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అదానీ గంగవరం పోర్టు(Adani Gangavaram Port) ద్వారా బొగ్గు, సున్నపురాయిని దిగుమతి వివాదంతో పాటుగా కార్మిక సంఘాల(Trade Unions) ఆరోపణలపై వివరణ ఇచ్చారు. కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలను ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. బాధ్యతాయుతంగా వ్యాపారం చేయడానికి, వాటాదారులందరి మధ్య నమ్మకాన్ని పెంపొందించడానికి గంగవరం పోర్టు కట్టుబడి ఉందన్నారు.

ఆలస్యంగా చెల్లింపులు చెల్లిస్తుండటంతో పాటుగా గత 8 నెలలుగా భారీ మొత్తంలో అదానీ గ్రూపుకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నప్పటికీ బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా ఆర్ఎన్ఎల్కి కార్గో హ్యాండ్లింగ్(
Cargo handling to RNL) సేవలను అందిస్తున్నామని చెప్పారు. బకాయిలను పూర్తిగా చెల్లించటంలో తమ వాగ్దానాలను గౌరవించాలని, పోర్ట్ కార్యకలాపాలకు సంబంధించి కార్గో హ్యాండ్లింగ్ స్థిరంగా ఉంటుందనే భరోసా కల్పించాలని ఆర్ఎస్ఎల్(RSL) నాయకులను అభ్యర్థించారు. మొత్తం పారిశ్రామిక ప్రాంతంతో పాటుగా పోర్టులో కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా ప్రజలను సైతం ప్రభావితం చేస్తుందన్నారు. కాబట్టి పోర్ట్ ప్రాంగణం వెలుపల కార్మికులు గుంపులుగా ఉండడం మానుకోవాలని యూనియన్లను అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు అభ్యర్థించారు.

Updated Date - 2023-08-03T23:48:06+05:30 IST