Share News

Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:16 AM

ఓ ద్విచక్ర వాహనాన్ని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీ సత్యసాయి జిల్లా: ఓ ద్విచక్ర వాహనాన్ని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ కింద తండాకు చెందిన బాబు నాయక్, షకీలా నాయక్ ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబు నాయక్, షకీలా నాయక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:16 AM