Crime: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడైతే.. తోటి ఉద్యోగినిపై పోలీస్ ఆఫీసర్ అత్యాచారం

ABN , First Publish Date - 2023-08-31T19:39:24+05:30 IST

సామాన్యులను రక్షించాల్సిన పోలీస్ అధికారే రాక్షసుడిలా మారి దారుణానికి పాల్పడ్డాడు. అది కూడా తన తోటి ఉద్యోగిని అయినా మహిళా పోలీస్ పట్ల కావడం గమనార్హం.

Crime: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడైతే.. తోటి ఉద్యోగినిపై పోలీస్ ఆఫీసర్ అత్యాచారం

సామాన్యులను రక్షించాల్సిన పోలీస్ అధికారే రాక్షసుడిలా మారి దారుణానికి పాల్పడ్డాడు. అది కూడా తన తోటి ఉద్యోగిని అయినా మహిళా పోలీస్ పట్ల కావడం గమనార్హం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తోటి ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డ పోలీస్ అధికారి.. చివరకు కట్నం పేరుతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తోటి ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ పోలీస్ అధికారిపై కేసు నమోదైంది. నిందితుడి పేరు రూమ్ సింగ్. శిక్షణ సమయంలో తమ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిందితుడు రూమ్ సింగ్ బాధితురాలిపై కొన్నాళ్లపాటు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఒత్తిడి మేరకు రూమ్ సింగ్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోవడానికి అంగీరించాడు.


అయితే కట్నంగా రూ.5 లక్షలు, లగ్జరీ కారు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూమ్ సింగ్ అడిగిన కట్నం ఇవ్వడానికి బాధితురాలి కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రూమ్ సింగ్ బాధితురాలిని వివాహం చేసుకోవడానినకి నిరాకరించాడు. బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ ఝాన్సీలోని రూమ్ సింగ్ ఉంటున్న ఇంటికి వెళ్లింది. కానీ రూమ్ సింగ్, అతని కుటుంబసభ్యులు మహిళా కానిస్టేబుల్‌ను కొట్టి తరిమిచేశారు. దీంతో బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూమ్ సింగ్‌పై అత్యాచారం, దాడి, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. రూమ్ సింగ్ తండ్రి పురాన్ సింగ్, తల్లి, సోదరుడు లలిత్ కుమార్‌లపై దాడి కేసు నమైంది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2023-08-31T19:43:18+05:30 IST