Share News

Kerala: ఎరుమేలి వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యప్ప స్వాముల ఆందోళన

ABN , Publish Date - Dec 25 , 2023 | 04:28 PM

Kerala: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. మకరజ్యోతిని మించిన రద్దీ శబరిమలలో కనిపిస్తోంది. మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు.

 Kerala: ఎరుమేలి వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై అయ్యప్ప స్వాముల ఆందోళన

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతోంది. మకరజ్యోతిని మించిన రద్దీ శబరిమలలో కనిపిస్తోంది. మండల పూజల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అయ్యప్పలు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ వాహనాలను అనుమతించాలని ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమలలో భక్తుల రద్దీ కనిపిస్తోందని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు, కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని అయ్యప్పలు ఆరోపిస్తున్నారు. దీంతో పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్‌లు నిలిచిపోయాయి. ఈనెల 27తో మండల పూజలు ముగియనున్నాయి. వరుస సెలవులు రావడంతో కూడా అయ్యప్పలు భారీగా శబరిమలకు వెళ్తున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఎరుమేలిలో వాహనాలను నిలిపివేస్తున్నారు. అటు అనూహ్య రద్దీ కారణంగా వర్చువల్ క్యూ బుకింగ్‌లను తగ్గించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు చర్యలను చేపట్టింది.


మరిన్ని నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 25 , 2023 | 04:28 PM