Share News

Delhi: ఆర్థిక నేరస్థులను అదుపులోకి తీసుకుంటే సంకెళ్లు వేయొద్దు.. సిఫార్సు చేసిన పార్లమెంటరీ కమిటీ

ABN , First Publish Date - 2023-11-13T14:56:35+05:30 IST

ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి సంకెళ్లు వేయవద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు(Parliamentary Standing Committee) చేసింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్(Brij Lal) నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధించిన మార్పులను సూచించింది.

Delhi: ఆర్థిక నేరస్థులను అదుపులోకి తీసుకుంటే సంకెళ్లు వేయొద్దు.. సిఫార్సు చేసిన పార్లమెంటరీ కమిటీ

ఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి సంకెళ్లు వేయవద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు(Parliamentary Standing Committee) చేసింది. బీజేపీ ఎంపీ బ్రిజ్‌లాల్(Brij Lal) నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధించిన మార్పులను సూచించింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPC) బ్రిటిష్ కాలంనాటిదని.. దానిని అనుసరించే అవసరం లేదని పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత (BNS-2023), భారతీయ సాక్ష్య అధినియం (BSA-2023) బిల్లులతో పాటు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS-2023) బిల్లును ఆగస్టు 11న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

మూడు ప్రతిపాదిత చట్టాలు క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్(CrPC) - 1898, ఇండియన్ పీనల్ కోడ్(IPC) - 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(IEA) - 1872ల స్ధానంలో తెచ్చినవి. BNSS క్లాజ్ 43(3)లో పేర్కొన్న విధంగా, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు తప్పించుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది విధించే శిక్షలకు పరిమితి విధించింది. అయితే ‘ఆర్థిక నేరాలను’ ఈ కేటగిరీలో చేర్చకూడదని కమిటీ అభిప్రాయపడింది.


ఎందుకంటే ఆర్థిక నేరాల్లో అనేక రకాలు ఉంటాయి. చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని నేరాలకు చేతికి సంకెళ్లు వేయడం సరికాదని కమిటీ అభిప్రాయపడింది. 'ఆర్థిక నేరాలు' అనే పదాన్ని తొలగించడానికి క్లాజ్ 43(3)ని సవరించవచ్చని ప్యానెల్ సూచించింది. ఆ క్లాజ్ ప్రకారం.. పోలీసు అధికారి నేర స్థాయినిబట్టి కస్టడీ నుంచి మాటిమాటికి తప్పించుకుంటున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో చేతికి సంకెళ్ళు ఉపయోగించవచ్చు.

వ్యవస్థీకృత నేరం, ఉగ్రవాద చర్య, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరం లేదా అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం, హత్య, అత్యాచారం, యాసిడ్ దాడి, నకిలీ నాణేలు, ఫేక్ కరెన్సీ నోట్లతో పట్టుబడటం, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక నేరాలు ఇలాంటివాటికి పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

ఈ క్లాజ్ వివరణలో మరింత స్పష్టత ఇవ్వడానికి తగిన సవరణను తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. BNSS క్లాజ్ 482లో, 'నిందితుడు మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీకి అవసరం కావచ్చు' అనే పదాలను కూడా కమిషన్ జోడించింది. ప్రస్తుత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) ప్రకారం, విచారణ సందర్భంగా నిందితుడిని గరిష్టంగా 15 రోజుల వరకు మాత్రమే పోలీసు కస్టడీ కోరవచ్చు. పార్లమెంటరీ ప్యానెల్ నివేదికలను శుక్రవారం రాజ్యసభకు సమర్పించింది.

Updated Date - 2023-11-13T14:56:36+05:30 IST