Home » criminal justice system
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్ కాదని, పరిస్థితులే వారిని నేరస్తులుగా మార్చుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలు కారణాల ప్రభావంతో వారు నేరాలు చేస్తారని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మానవత్వంతో విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొంది.
New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాల వల్ల బాధితులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు వినోద్.
ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త క్రిమినల్ చట్టాలు(New Criminal Laws) జులై 1నుంచి అమలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 17 వేల 500 పోలీస్ స్టేషనల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
కొత్త క్రిమినల్ చట్టాలైన 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ ఆదివారంనాడు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు.. వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ అన్నారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
సమాజంలో ఎన్ని నేరాలు చేసినా కొందరు తమ పలుకుబడితో పరిహారాన్ని(Compensation) ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారి వల్ల దేశంలో రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక నేరాలకు పాల్పడి కస్టడీకి తీసుకున్న వారి చేతికి సంకెళ్లు వేయవద్దని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు(Parliamentary Standing Committee) చేసింది. బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్(Brij Lal) నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) ప్రకారం ఒక ఆర్థిక నేరగాడిని అరెస్టు చేసిన మొదటి 15 రోజులకు మించి పోలీసు కస్టడీలో ఉంచినప్పుడు సంబంధించిన మార్పులను సూచించింది.