Share News

New Criminal Laws: కొత్త చట్టాలపై సుప్రీంకోర్టుకెళతాం: వినోద్ కుమార్

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:19 PM

New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాల వల్ల బాధితులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు వినోద్.

New Criminal Laws: కొత్త చట్టాలపై సుప్రీంకోర్టుకెళతాం: వినోద్ కుమార్
Vinod Kumar

New Criminal Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాల వల్ల బాధితులే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు వినోద్. ఇదే అంశంపై ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. క్రిమినల్ లా కు సంబంధించిన మూడు కీలక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వాటి స్థానంలో జులై 1 నుంచి దేశంలో మూడు కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. గతేడాది ఆగస్టులో ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని.. స్టాండింగ్ కమిటీ సభ్యులు బిల్లులకు అనేక సూచనలు చేశారన్నారు. అయితే, మోదీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని.. వారు తెచ్చిన బిల్లులనే ఆమోదించుకున్నారని వినోద్ ఆరోపించారు. ఈ చట్టాల వల్ల బాధితులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.


ఈ చట్టాలను జూలై 1నుంచి అమలులోకి తెస్తున్నారని చెప్పిన వినోద్ కుమార్.. ఇండియన్ పీనల్ కోడ్ ఏది నేరమో చెబుతోందన్నారు. కానీ, ఇండియన్ పీనల్ కోడ్ పేరును మార్చి భారతీయ న్యాయ సన్నిహిత అని పెట్టారన్నారు. CRPCకి భారతీయ నాగరిక సంహిత అని పేరు పెట్టారని తెలిపారు. కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. హిందీ, సంస్కృత భాషను తమపై ఎందుకు రద్దుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈ కొత్త చట్టాలను నిలుపుదల చేయాలని వినోద్ డిమాండ్ చేశారు. బ్యూరోక్రసి రూపొందించిన చట్టాలను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు. కొత్త చట్టంలో కంప్లైంట్ వస్తే విచారణ పేరుతో 15రోజుల వరకు FIR చేయకుండా కాలయాపన చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు వినోద్. అంతేకాదు.. ఈ చట్టం వల్ల బాధితుడికి అన్యాయం జరుగుతుందని.. రిమైండ్ చేసి 14రోజుల లోపు పోలీస్ కష్టడికి తీసుకునే చట్టాన్ని 90రోజులకు పెంచారన్నారు. కొత్త చట్టాల్లో అనేక లోపాలు ఉన్నాయన్నారు. ఈ కొత్త చట్టాల వల్ల పోలీస్ పవర్స్ మరింత పెరుగుతాయని.. వాటిని పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. అందుకే.. ఈ చట్టాలపై సోమవారం నాడు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.


సోమ భరత్ మాట్లాడుతూ..

అమలులో ఉన్న చట్టాల స్థానంలో కొత్తవి తేవాలి అనుకున్నప్పుడు న్యాయ వాదులతో సమగ్రంగా చర్చించాల్సిందని సోమ భరత్ అభిప్రాయపడ్డారు. కొత్త చట్టంలో FIR నమోదు కావాలి అంటే చాల కష్టమన్నారు. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్‌కు సర్క్యులర్ పంపి అభిప్రాయం తీసుకోవాల్సిందన్నారు. పోలీస్ చర్యలపై కోర్టు రక్షణ లేకుండా కొత్త చట్టంలో ఉందని.. కొత్త చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడబోతున్నారని చెప్పారు. అందుకే ఈ చట్టాలన ఆపాలని సోమ భరత్ డిమాండ్ చేశారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 30 , 2024 | 05:19 PM