Share News

Supreme Court: పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్‌ కారు

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:52 AM

పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్‌ కాదని, పరిస్థితులే వారిని నేరస్తులుగా మార్చుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలు కారణాల ప్రభావంతో వారు నేరాలు చేస్తారని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మానవత్వంతో విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొంది.

Supreme Court: పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్‌ కారు

న్యూఢిల్లీ, జూలై 5: పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్‌ కాదని, పరిస్థితులే వారిని నేరస్తులుగా మార్చుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలు కారణాల ప్రభావంతో వారు నేరాలు చేస్తారని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మానవత్వంతో విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొంది. విచారణ ప్రారంభం కాకపోవడంతో నాలుగేళ్లుగా జైలులో ఉన్న నకిలీ కరెన్సీ కేసు నిందితునికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

పాకిస్థాన్‌ నుంచి నకిలీ రూ.2000 కరెన్సీ నోట్లు తీసుకొచ్చాడన్న ఆరోపణ మీద ముంబయికి చెందిన ఓ వ్యక్తిని 2020 ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1193 నోట్లు ఉన్న బ్యాగును కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కస్టడీలో ఉన్న అతనికి బెయిల్‌ ఇచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితుడు నాలుగేళ్లుగా జైలులో ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.

Updated Date - Jul 06 , 2024 | 08:21 AM