Share News

Heavy rain: కడలూరులో భారీ వర్షం.. కూలిన భవనం

ABN , First Publish Date - 2023-11-29T07:12:34+05:30 IST

కడలూరు(Kadaluru) జిల్లాలో మంగళవారం వేకువజాము కుండపోత వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు రహదారులు, పల్లపు ప్రాంతాలు

Heavy rain: కడలూరులో భారీ వర్షం.. కూలిన భవనం

- కులశేఖరపట్టినంలో కుండపోత

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కడలూరు(Kadaluru) జిల్లాలో మంగళవారం వేకువజాము కుండపోత వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని పలు రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల కారణంగా తిరుప్పాత్తిపులియూరు రహదారిలో ఉన్న రెండంతస్థుల భవనం కూలింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు వెళ్ళకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లారెన్స్‌ రోడ్డులోని రైల్వే సబ్‌వేలో వర్షపు నీరు వరదలా పొంగి ప్రవహించడంతో పాదచారులు ఇబ్బంది పడ్డారు.

కులశేఖరపట్టినంలో 6. సెం.మీల వర్షపాతం...

తిరునల్వేలి జిల్లా కులశేఖరపట్టినంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ఉడన్‌కుడి వారపు సంతలో వర్షపునీరు వరదలా ప్రవహించింది. ఆ జిల్లాలోని సేర్వలారు, మణిముత్తారు జలాశయాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కులశేఖరపట్టినంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. అంబై, చేరన్‌మాదేవి, నాంగునేరి, కల్లకాడు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. ఇదే విధంగా తెన్‌కాశి జిల్లాలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి.

nani2.2.jpg

Updated Date - 2023-11-29T07:12:36+05:30 IST