Womans Reservations: మహిళా రిజర్వేషన్‌పై హర్షం వ్యక్తం చేసిన కంగనా, ఈషా గుప్తా..
ABN , First Publish Date - 2023-09-19T18:52:19+05:30 IST
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.
ఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు. వారికి సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్(Anurag Takur) స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మిఠాయిలు పంచుతూ, కంగనాను "సంసద్ మే పెహ్లీ బార్ (మీరు మొదటిసారి పార్లమెంటును సందర్శిస్తున్నారా)?" అని ప్రశ్నించగా.. కంగనా స్పందిస్తూ "అవును సర్" అని సమాధానం ఇచ్చారు. అనంతరం ప్రధాని మోదీని ఆమె ప్రశంసించారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని మహిళలు, బాలికలు, వృద్ధుల భద్రత కోసం బీజేపీ సర్కార్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే నిర్ణయం అని ఆమె అన్నారు. భారత పార్లమెంటు కొత్త భవనం దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని కొనియాడారు.
ఈషా గుప్తా మాట్లాడుతూ..
ఈషా గుప్తా మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలనే కల చిన్నప్పటి నుంచి ఉండేదని అన్నారు. ప్రధాని మోదీ(PM Modi) ప్రొగ్రెసివ్ థాట్స్ వల్లే దేశం పురోగాభివృద్ధి సాధిస్తోందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే నా కల నెరవేరి 2026లో ప్రజాప్రతినిధిగా చూస్తారని ఆమె అన్నారు.