PM Modi : ‘ది ఎలిఫెంట్ విస్పరర్’ జంట బొమ్మన్, బెల్లీలతో మోదీ మాటమంతి
ABN , First Publish Date - 2023-04-09T16:14:23+05:30 IST
ఏనుగుల సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన బొమ్మన్, బెల్లీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
బెంగళూరు : ఏనుగుల సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన బొమ్మన్, బెల్లీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం ముచ్చటించారు. ఇటీవల ఆస్కార్ బహుమతి సాధించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీ ఈ జంట జీవితం ఆధారంగానే రూపొందిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ కలుసుకోవడం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు.
మోదీ ఇచ్చిన ట్వీట్లో, అద్భుతమైన బొమ్మన్, బెల్లీలను, వారితోపాటు బొమ్మి, రఘు ఏనుగులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరిని మోదీ తెప్పక్కడు ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఆదివారం కలిశారు. రఘు అనే ఏనుగును నిమురుతూ సంతోషించారు.
మోదీ మొదట తెల్లని కుర్తా, పైజమా, బ్లాక్ నెహ్రూ జాకెట్ ధరించి, ఈ జంటతో సంభాషించారు. ఆ తర్వాత ఖాకీ రంగు చొక్కా, ప్యాంట్, టోపీ ధరించి, ఈ జంటతోపాటు ఏనుగుల వద్దకు వెళ్లారు.
మోదీ శనివారం సాయంత్రం కర్ణాటకకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం మైసూరులోని పులుల అభయారణ్యాన్ని సందర్శించారు.
ఇవి కూడా చదవండి :
Japan: ఇసుకలో మొండెం వరకు కూరుకుపోతున్న జపనీయులు.. ఎందుకో తెలుసా..
Tigers : దేశంలో పులుల సంఖ్య పెరిగింది : మోదీ