Share News

Supreme Court: సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట..

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:38 PM

National: సినీనటి జయప్రద కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చెన్నయ్‌లోని జయప్రద సినిమీ థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసుపై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. జయప్రదకు చెన్నయ్ ట్రయల్ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

Supreme Court: సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట..

న్యూఢిల్లీ: సినీనటి జయప్రదకు (Actress Jayaprada) సుప్రీంకోర్టు (Supreme Court) ఊరట దక్కింది. చెన్నైలోని జయప్రద సినిమా థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో కింద స్థాయి కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమె ఉపశమనం లభించింది. ఈ మేరకు జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జయప్రద పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసేంతవరకూ జైలు శిక్షపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

చెన్నైలోని జయప్రద సినిమా థియేటర్‌కు సంబంధించి ఈఎస్‌ఐ కేసులో చెన్నై ట్రయల్ కోర్టు ఆమెకు 6 నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాలు చేసింది. అయితే ట్రయల్ కోర్టును హైకోర్టు సమర్థించింది. స్టే విధించడానికి నిరాకరించింది. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో జయప్రద సవాలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2023 | 02:36 PM