Anti ageing foods: మగాళ్లూ.. వయసు కనబడుతోందని తెగ బాధపడిపోతున్నారా?.. అయితే ఈ 7 ఆహార పదార్థాలు తినండి చాలు..

ABN , First Publish Date - 2023-03-01T14:14:27+05:30 IST

ఆరోగ్యకరమైన అలవాట్లతో వయసును కొద్దిరోజులు దూరం పెట్టచ్చు.

Anti ageing foods: మగాళ్లూ.. వయసు కనబడుతోందని తెగ బాధపడిపోతున్నారా?.. అయితే ఈ 7 ఆహార పదార్థాలు తినండి చాలు..
Anti Ageing

శారీరక, మానసిక మార్పులతో మానవ శరీరం వృద్ధాప్యంలో అనేక మార్పులకు లోనవుతుంది. వీటిలో అత్యంత ముఖ్యమైన మార్పు జీవక్రియ మందగించడం, దీనితో బరువు పెరగడం, శక్తి తగ్గడం వంటి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయినప్పటికీ, వృద్ధాప్య ఛాయలను ఎదుర్కోవటానికి, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడానికి సహాయపడే కొన్ని ఆహార పదార్థాలను పురుషులు తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అందులో ఈ ఏడు ఆహార పదార్థాలు వయసును తక్కువగా చూపించడంలో ముఖ్యమైనవి.

బెర్రీస్: బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి సెల్ డ్యామేజ్‌ను నివారిస్తాయి. బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి అద్భుతమైన ఆహార పదార్థాలతో వృద్ధాప్యం కొద్దిరోజు మన మీద దాటిచేయకుండా ఆపవచ్చు.

నట్స్ (Nuts): నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన బరువును, అలాగే గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. వాల్‌నట్‌లు, బాదంపప్పులు, జీడిపప్పులు యాంటీ ఆక్సిడెంట్లకు ఉత్తమమైన ఆహారం.

ఇది కూడా చదవండి: ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. మీ కిడ్నీలు సురక్షితం..!

ఆకు కూరలు (Leafy Greens): బచ్చలి కూర, కేల్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, కణాల నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంపొందిస్తుంది.

సాల్మన్ (Salmon) : ఈ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంతో పాటు, గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి. ఇందులో ప్రోటీన్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. కండరాల నష్టాన్ని నిరోధించడంలో సహకరిస్తాయి.

పసుపు(Turmeric) : పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ (Green Tea): గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ మానసిక దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పెరుగు (Yoghurt) : పెరుగులో యోగర్ట్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డార్క్ చాక్లెట్ (Dark Chocolate) : డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహకరిస్తాయి. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

వృద్ధాప్యం సాధారణ సంకేతాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు ఏమిటి?

వృద్ధాప్యంలో పడుతున్నామనడానికి సాధారణ సంకేతాలు ముఖం మీద ముడతలు, మెరుపు తగ్గిన చర్మం, వయస్సుతో వచ్చే మచ్చలు, శరీరంలో శక్తి స్థాయిలు తగ్గడం వంటి లక్షణాలతో వయసు పెరుగుతుందని, వృద్ధాప్యంలో పడుతున్నామని నిర్ధారిస్తాం. కొన్ని సహజ వృద్ధాప్య నివారణలలో ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర పొందడం, ఒత్తిడిని నిర్వహించడం, ధూమపానం, అధిక మద్యపానాన్ని నివారించడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో వృద్ధాప్యాన్ని కొద్దిరోజులు దూరం పెట్టచ్చు.

Updated Date - 2023-03-01T14:17:59+05:30 IST