vastu tips: వేపచెట్టు ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాయా? అసలు ఏ దిక్కులో ఉండాలి..!
ABN , First Publish Date - 2023-04-24T12:10:32+05:30 IST
వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది.
శుభకార్యమైనా, పండగైనా మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో.. వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అలాగే వేపాకుకూ అంతే ప్రాముఖ్యత ఉంది. వేప పుల్లతో పళ్ళుతోముకోవడం, పంటకు పురుగు పట్టకుండా వేప ఆకు రసాన్ని పిచికారీ చేయడం,. బియ్యంలో వేపాకును వేసి ఉంచడం, చర్మసుద్ధికి, రక్త సుద్థికీ వేపాకును వాడటం అనేది అనాదిగా వస్తున్న పద్దతి. కొన్ని ప్రాంతాల్లో వేపాకు పూజలు కూడా పరిపాటే,, అలాగే ఉగాదిలో వేప పువ్వు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కరలెద్దు. వేపగాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుతారు. అసలు ఇన్ని గుణాలున్న వేప చెట్టు మన ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి.
హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లగా పవిత్రమైన చెట్లు గాను గుర్తించబడింది..వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వేప చెట్టు వాస్తు దోషాలను తొలగిస్తుంది అని చెబుతూనే వేప చెట్టును ఇంట్లో పెట్టకూడదు అని కూడా అంటూ ఉంటారు. అసలు వేప చెట్టు ఏ దిశలో ఉండాలి? తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది?
వాస్తు శాస్త్రం ప్రకారం వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని పలువురు వాస్తు నిపుణులు చెబుతారు. అందుకు కారణం లేకపోలేదు. వేప చెట్టు మహావృక్షం అవుతుంది. దాని వేర్లు ఇంటి గోడలలోకి వ్యాపించినప్పుడు గోడలు నెర్రెలు బారతాయి. అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి అశుభాన్ని తీసుకువస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్లను పెంచకూడదని చెబుతున్నారు. ఒకవేళ వేప చెట్టును పెంచినా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు.
ఆ దిశలలోనే వేపచెట్టు పెంచితే మంచిది అయితే ఇంటికి సమీపంలో ఏ దిశలో పడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిది కాదని చెబుతున్నారు. వేప చెట్టును పెంచాలనుకుంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు. దక్షిణ దిశలోనే పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచాలని ఈ దిశలలో వేప చెట్లను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. చాలామంది ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్లను పెట్టి పెంచుతూ ఉంటారు.
ఇది కూడా చదవండి: ఫ్రిడ్జ్‌లో గుడ్లు స్టోర్ చేసేటప్పుడు ఈ ఏడు విషయాలు మైండ్‌లో పెట్టుకోండి.. లేకపోతే..
తూర్పు దిశలో వేపచెట్టు ఉంటే ఏమవుతుంది? పరిహారం ఏమిటి? అయితే వాస్తు ప్రకారం తూర్పు దిశలో కాంపౌండ్ వాల్ బయట ఉన్న చెట్లను కొట్టేయాల్సిన అవసరం లేదు. తూర్పు దిశలో వేపచెట్టు ఉండటం వల్ల వాస్తు దోషం కలిగి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ వాస్తు దోషం తొలగి పోవాలంటే.. తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారాల్లో ఆ వేప చెట్టుకు పూజలు చేస్తారు, అంతేకాదు ఆ వేప చెట్టుకు 108 పసుపు దారాలను చుట్టి పూజించాలని చెబుతారు. ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోయి, పనుల ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుందట.