Chandrababu Birthday: మెల్బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-04-21T07:23:05+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 73వ జన్మదిన వేడుకలు (73rd Birthday Celebrations) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne) నగరంలో ఘనంగా జరిగాయి.

Chandrababu Birthday: మెల్బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

మెల్బోర్న్‌: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 73వ జన్మదిన వేడుకలు (73rd Birthday Celebrations) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne) నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నారైలు చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సరి అయిన గాడిలో పడాలి అంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం అని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా (NRI TDP Australia) సభ్యులు కేక్ కట్ చేసి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. వచ్చేసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం (Telugu Desam) జెండా ఎగరడం ఖాయమని వారు అన్నారు. విధ్వంసపాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.

Chandrababu Birthday: వాషింగ్టన్ డీసీలో ఘనంగా చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు


Updated Date - 2023-04-21T07:23:05+05:30 IST