Share News

TS Assembly Polls : 97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్.. మిగిలిన 18 మందిని కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?

ABN , First Publish Date - 2023-10-16T19:04:02+05:30 IST

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు జోరు పెంచారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. మరోవైపు మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అంతేకాదు.. 97 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్‌లు అందజేశారు...

TS Assembly Polls : 97 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్.. మిగిలిన 18 మందిని కేసీఆర్ ఏం చేయబోతున్నారు..?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు జోరు పెంచారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. మరోవైపు మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అంతేకాదు.. 97 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్‌లు అందజేశారు. ఆదివారం రోజునే మేనిఫెస్టో ప్రకటన, హుస్నాబాద్ వేదికగా ఎన్నికల సమర శంఖం పూరించారు. నిన్న ఒక్కరోజే మధ్యాహ్నం వరకూ 51 మందికి.. రాత్రి 18 మందికి.. ఇక సోమవారం నాడు 28 మంది అభ్యర్థులకు బీ-ఫారాలను స్వయంగా కేసీఆరే అందజేశారు. దీంతో ఇవాళ్టికి మొత్తం 97 మంది అభ్యర్థులు బీఫామ్‌లు తీసుకున్నారు. ఇక మిగిలింది కేవలం 18 మంది మాత్రమే.


B-Forms-Today.jpg

18 మంది కథేంటి..!

అయితే ఇందులో అభ్యర్థులు ప్రకటించిన కొందరికీ బీఫామ్‌లు కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్రహమ్‌ను ప్రకటించినప్పటికీ బీ-ఫామ్ మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు.. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని చూస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బీఫారాలు ఇవ్వని ఆ 18 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయం అసమ్మతి నెలకొన్నవే. దీంతో 18 మంది అభ్యర్థుల్లో ఎంతమందిని మారుస్తారు..? అనేదానిపై క్లారిటీ రావట్లేదు. మరోవైపు.. బీఫామ్ వచ్చే దాకా తాను అభ్యర్థిని కానని కొందరు ఆశలు వదులుకున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కాగా.. ఇందులో రెండు, మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా అధిష్టానం ఫిక్స్ చేయలేదు.

B-Forms-Today-2.jpg

ఇవాళ బీ-ఫామ్‌లు తీసుకున్న అభ్యర్థులు వీరే..

1. సంజయ్ కల్వకుంట్ల

2. డా. ఎన్ . సంజయ్ కుమార్

3. కొప్పుల ఈశ్వర్

4. కోరుకంటి చందర్

5. పుట్ట మథు

6. చింత ప్రభాకర్

7. చామకూర మల్లారెడ్డి

8. కె పి వివేకానంద్

9. మాధవరం కృష్ణారావు

10. మంచికంటి కిషన్ రెడ్డి

11. సబితా ఇంద్రారెడ్డి

12. టి. ప్రకాశ్ గౌడ్

13. కాలె యాదయ్య

14. కొప్పుల మహేశ్ రెడ్డి

15. మెతుకు ఆనంద్

16. ముఠా గోపాల్

17. కాలేరు వెంకటేశ్

18. దానం నాగేందర్

19. మాగంటి గోపీనాథ్

20. టి. పద్మారావు

21. లాస్య నందిత

22. గొంగిడి సునీత

23. శానంపూడి సైదిరెడ్డి

24. డి.ఎస్.రెడ్యానాయక్

25. బానోత్ శంకర్ నాయక్

26. చల్లా ధర్మారెడ్డి

27. ఆరూరి రమేశ్

28. గండ్ర వెంకట రమణారెడ్డి

Updated Date - 2023-10-16T19:04:36+05:30 IST