Nara Lokesh: జగన్‌, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై లోకేష్ సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-04-18T20:17:56+05:30 IST

ఆళ్ల మైనింగ్ మాఫియాపై పోరాడిన టీడీపీ నేతలను అభినందిస్తున్నానని లోకేష్ తెలిపారు.

Nara Lokesh: జగన్‌, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై లోకేష్ సంచలన ఆరోపణలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy), మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై (Mangalagiri YCP MLA Alla Ramakrishna Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP National General Secretary Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగనే ఆదర్శంమని, సహజ వనరుల దోపిడీలో జగన్ను ఆదర్శంగా తీసుకున్నారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ రుషికొండకు గుండు కొడితే.. ఆళ్ల ఉండవల్లి కొండను మింగేశారని విమర్శించారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే ఆళ్ల మైనింగ్ మాఫియా అక్రమాలు చేస్తోందని, ఉండవల్లి కొండను మాయం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆళ్ల మైనింగ్ మాఫియాపై పోరాడిన టీడీపీ నేతలను అభినందిస్తున్నానని లోకేష్ తెలిపారు.

చంచల్గూడ జైలుకు త్వరలో జగన్ వెళ్లబోతున్నారని, జగనాసుర రక్తచరిత్రతో ఆయన వెంట్రుక.. ఆయనే పీక్కుంటున్నాడని, లూటీ మోహన్‌పై కర్నూలు ఆలూరు సభలో నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. యువగళం ముందు తర్వాత జగన్లో చాలా తేడా ఉందని, ముందు ప్రజలను పీడించాడు..ఇప్పుడు తోక ముడుచుకున్నాడని మండిపడ్డారు. జగన్ని చూస్తే ఒక కమేడియన్ గుర్తుకు వస్తున్నాడని, MLAలకు స్టిక్కర్లు ఇచ్చారని,.. కుక్కలకు కూడా అవి నచ్చడం లేదన్నారు. స్టిక్కర్ చించిన కుక్కను కూడా వదలకుండా కేసులు పెడుతున్నారని, తనను జగన్ ఏం చేయలేక.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపాలని తాను సవాల్ చేస్తే స్పందన లేదన్నారు.

మైనార్టీలను వేధించిన పాపం జగన్‌ను ఊరికే విడిచిపెట్టదని, టీడీపీ వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేష్ చెప్పారు. జగన్ రాయలసీమ బిడ్డ కాదని,.. ఈ ప్రాంతానికి పడ్డ క్యాన్సర్ గడ్డ అని, ప్రాజెక్టులకు చంద్రబాబు ఖర్చు పెట్టినదాంట్లో.. పదో వంతు కూడా జగన్ ఖర్చు చేయలేదని నారా లోకేష్ ఆరోపించారు. వాల్మీకి సోదరులకు ఒక్క ఎకరం భూమి అయినా కొన్నారా.. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వందల ఎకరాలు కబ్జా చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక్కడి ఎమ్మెల్యే మాత్రం బెంజ్ కారు కొనుక్కున్నాడని, బెంజ్‌ మంత్రి నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు. మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో ఆయన సోదడురు అంతరాష్ట్ర పేకాట క్లబ్‌ నిర్వహిస్తున్నారని, బెంజ్ మంత్రి కర్ణాటక మద్యం, అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, డోన్ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆలూరుకి పరిశ్రమలు తీసుకొస్తామని, రైతులు మోటార్లకు మీటర్లు పెట్టవద్దని, ప్రభుత్వం బలవంతంగా మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-18T20:23:24+05:30 IST