Share News

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

ABN , First Publish Date - 2023-11-13T16:28:55+05:30 IST

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తోంది. సరిగ్గా..

Telangana Elections : అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో 14 జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్నారు. దీంతో ఆ 14 జిల్లాలకు ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే కొత్త అధ్యక్షుల నియామకమని హైకమాండ్ చెబుతోంది. ప్రస్తుతానికి 14 జిల్లాలకు తాత్కాలిక ప్రెసిడెంట్లను నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.


congress.jpg

ఎవరికి ప్రాధాన్యత..?

ఈ వారంలోనే తాత్కాలిక ప్రెసిండెంట్ల పేర్లను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ జిల్లాలకు ఎవర్ని నియమించాలనే దానిపై కమిటీ ఏర్పాటు చేసి.. నిశితంగా పరిశీలించిన తర్వాతే అధ్యక్షుల ప్రకటన ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే టికెట్ దక్కని నేతలు, యువనేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. కాంగ్రెస్ టికెట్లు రాలేదని, ఎన్నో ఆశలుపెట్టుకున్న ఆశావహులు అధిష్టానంపై అసంతృప్తిగా కొందరు నేతలు రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఇలా చేయడంతో ఎలాంటి ప్రయోజనం లేదు..? అసలు ఎందుకిలా..? అని కొందరు నేతలు చెబుతున్న మాట. ఏం చేసినా పార్టీ గెలుపుకోసమేనని సీనియర్ నేతలు చెబుతున్న పరిస్థితి. ఫైనల్‌గా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో..? ప్రకటన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

revanth-ramgundam.jpg

Updated Date - 2023-11-13T16:30:10+05:30 IST