Share News

TS High Court: మంత్రి మల్లారెడ్డి ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసిన హైకోర్ట్

ABN , First Publish Date - 2023-11-18T16:12:56+05:30 IST

మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ( High Court ) లో వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసింది. మల్లారెడ్డి వేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ అంజిరెడ్డి హైకోర్టులో తెలిపారు.

TS High Court: మంత్రి మల్లారెడ్డి ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసిన హైకోర్ట్

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ( High Court ) లో వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసింది. మల్లారెడ్డి వేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ అంజిరెడ్డి హైకోర్టులో తెలిపారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఆఫిడవిట్‌లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు హైకోర్టుకు ఎన్నికల కమిషన్‌ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో మల్లరెడ్డి ఆఫిడవిట్‌పై హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-18T17:13:41+05:30 IST