Doctor Video: డాక్టర్ అంటే ఇలా కదా ఉండాల్సింది.. ఇంజెక్షన్ ఇచ్చినా సరే.. ఆ పాప నవ్వుతూనే ఉంది..!

ABN , First Publish Date - 2023-07-01T16:26:19+05:30 IST

ఆస్పత్రి అంటేనే చిన్న పిల్లలు భయపడిపోతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్తే బయటికి వచ్చేంత వరకూ ఆపకుండా ఏడుస్తుంటారు. ఇక ఇంజెక్షన్ చేస్తే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఇలాంటప్పుడు.. నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తే ఎంత బావుంటుంది.. అని అంతా అనుకుంటారు. ప్రస్తుతం..

Doctor Video: డాక్టర్ అంటే ఇలా కదా ఉండాల్సింది.. ఇంజెక్షన్ ఇచ్చినా సరే.. ఆ పాప నవ్వుతూనే ఉంది..!

ఆస్పత్రి అంటేనే చిన్న పిల్లలు భయపడిపోతుంటారు. డాక్టర్ వద్దకు వెళ్తే బయటికి వచ్చేంత వరకూ ఆపకుండా ఏడుస్తుంటారు. ఇక ఇంజెక్షన్ చేస్తే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఇలాంటప్పుడు.. నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తే ఎంత బావుంటుంది.. అని అంతా అనుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి డాక్టర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాక కూడా పిల్లలు నవ్వుతూ ఉండడం చూసి.. ‘‘నిజమైన డాక్టర్ అంటే నువ్వేనయ్యా’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం (National Doctors Day) సందర్భంగా ఈ వైద్యుడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ డాక్టర్‌కు సంబంధించిన వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) HSR లేఅవుట్‌ వద్ద సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ అనే వైద్యుడు చిన్న క్లినిక్ నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తుంటారు. పిల్లలను ఆడిస్తూ (doctor injecting child while playing) ఇంజెక్షన్ చేయడంలో ఇతను ప్రసిద్ధి. ఇంజెక్షన్ చేసినట్లు కూడా అనిపించకపోవడంతో పిల్లలు కూడా నవ్వుతూనే కనిపిస్తారు. ఈ క్లినిక్‌లోకి అడుగుపెట్టగానే.. విచిత్రంగా పిల్లల బొమ్మలు, చాక్లెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.

Viral Video: అది కారు అనుకున్నాడేమో.. ప్రయాణికులంతా విమానం ఎక్కుతుంటే.. పైలెట్ కిటికీ వద్ద ఏం చేస్తున్నాడో చూడండి..

doctor-funny-videos.jpg

డాక్టర్ కోసం వేచి చూసే క్రమంలో పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. పిల్లలను చూడగానే ముందుగా వారి మానసిక స్థితిని గమనించి, అందుకు తగ్గట్టుగా కాసేపు వారిని ఆటపాటలతో నవ్విస్తాడు. పిల్లల చేతికి బొమ్మలు ఇచ్చి, ఓ వైపు నవ్విస్తూనే.. మరోవైపు తెలీకుండానే ఇంజెక్షన్ చేస్తాడు. గుడ్‌విల్ చిల్డ్రన్స్ పేరుతో 2012లో క్లినిక్‌ను ప్రారంభించినట్లు సయ్యద్ తెలిపారు. పిల్లలు ఏడవకుండా ఇంజెక్షన్ ఎలా చేయాలనే అంశంపై చాలా ఏళ్లు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. కొందరు పిల్లలను అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుందని, ఇంకొందరు పిల్లలు త్వరగా కలిసిపోతారని అన్నారు.

Death Mystery: తెల్లారేసరికి ఇద్దరు పిల్లల మృతి.. రాత్రి పడుకునే ముందు నూడిల్స్‌తో పాటు వీటిని కూడా తినడం వల్లేనా..?

సాధ్యమైనంత వరకూ పిల్లలు ఏడవకుండా ఇంజెక్షన్ చేయాలన్నదే తన కోరిక అని సయ్యద్ తెలిపారు. ఈ క్లినిక్‌కి మైసూర్, హోసకోట్, కుణిగల్, దావణెగరె తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొస్తుంటారు. ఒక్కసారి ఈయన వద్దకు వచ్చిన వారు.. తరచూ ఇక్కడికే రావడం సర్వసాధారణంగా మారింది. ఈ డాక్టర్ పిల్లలకు ఇంజెక్షన్ చేస్తున్న సమయంలో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘నిజమైన డాక్టర్ అంటే నువ్వేనయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..

Updated Date - 2023-07-01T16:26:19+05:30 IST