Viral Video: దీని టాలెంట్ మామూలుగా లేదు భయ్యో!.. మూసి ఉన్న డోరు వద్దకు వెళ్లిన పిల్లి.. ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-09-10T19:17:44+05:30 IST

పెంపుడు జంతువుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించే జంతువులు కొన్నైతే.. మరికొన్ని జంతువులు ఏమీ చెప్పకుండానే ఏదోదే చేసేస్తూ యజమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎక్కువగా కుక్కలు, పిల్లులు ఇలాంటి పనులు..

Viral Video: దీని టాలెంట్ మామూలుగా లేదు భయ్యో!.. మూసి ఉన్న డోరు వద్దకు వెళ్లిన పిల్లి.. ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందంటే..

పెంపుడు జంతువుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించే జంతువులు కొన్నైతే.. మరికొన్ని జంతువులు ఏమీ చెప్పకుండానే ఏదోదే చేసేస్తూ యజమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎక్కువగా కుక్కలు, పిల్లులు ఇలాంటి పనులు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పిల్లులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మూసిఉన్న తలుపు వద్దకు వెళ్లిన పిల్లి.. చివరికి ఇంట్లోకి వెళ్లిన విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘దీని టాలెంట్ మామూలుగా లేదు భయ్యో!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు పెంపుడు పిల్లులు (pet cats) బయట చాలా సేపు అటూ ఇటూ తిరిగి చివరికి ఇంట్లోకి వెళ్లేందుకు డోరు వద్దకు చేరుకుంటాయి. అయితే డోరు మూసి ఉండడం చూసి వాటిలో ఓ పిల్లి నిరాశకు గురవుతుంది. ‘‘అయ్యో! మనం రావడం లేటయింది.. యజమానికి కోపం వచ్చి డోరు మూసినట్లున్నాడు.. ఇప్పుడెలా’’.. అన్నట్లుగా డల్‌గా ఉంటుంది. దీంతో పక్కన ఉన్న మరో పిల్లి.. ‘‘నువ్వేం టెన్షన్ పడకు.. ఈ డోరు తీయడం ఎలాగో నాకు తెలుసు.. ఎన్నిసార్లు వెళ్లలేదు’’.. అనుకుంటూ ఒక్క ఉదుటున పైకి ఎగిరి డోరు (Door lock handle) లాక్ హ్యాండిల్‌ను పట్టుకుంటుంది.

Viral Video: ఈ దొంగను చూసి యముడికీ భయమేసినట్టుంది.. ట్రాక్టర్‌ను చోరీ చేద్దామని వెళ్లి సడన్‌గా టైరు కింద పడ్డాడు.. చివరికి..

కాలితో హ్యాండిల్‌ని పట్టుకుని కిందకు లాగుతుంది. దీంతో డోరు మెల్లిగా ఓపెన్ అవుతుంది. దీంతో ‘‘చూశావా.. నా టాలెంట్’’.. అనుకుంటూ పిల్లి మెల్లిగా ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం వాటి యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిల్లి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ పిల్లి మనుషులని మించిపోయేలా ఉందే’’... అని మరికొందరు, ‘‘దొంగతనం ఎలా చేయాలో ఈ పిల్లికి బాగా తెలుసు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లగా రోగికి బదులుగా కోతి ప్రత్యక్షం.. అది చేసిన పని చూసి చివరకు అంతా షాక్..

Updated Date - 2023-09-10T19:17:46+05:30 IST