Share News

Viral Video: శాంటాక్లాజ్ వేషధారిని వెంటపడి తరిమిన మేక.. అతడు చేసిన చిన్న పొరపాటుతో చివరికి..

ABN , Publish Date - Dec 31 , 2023 | 06:46 PM

క్రిస్మస్ సందర్భంగా పలువురు శాంటాక్లాజ్ వేషధారణలో బహుమతులు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. శాంటాక్లాజ్ తాతను చిన్న పిల్లలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..

Viral Video: శాంటాక్లాజ్ వేషధారిని వెంటపడి తరిమిన మేక.. అతడు చేసిన చిన్న పొరపాటుతో చివరికి..

క్రిస్మస్ సందర్భంగా పలువురు శాంటాక్లాజ్ వేషధారణలో బహుమతులు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. శాంటాక్లాజ్ తాతను చిన్న పిల్లలు ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. శాంటాక్లాజ్ వేషధారులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ శాంటాక్లాజ్ వేషధారిని మేక వెంటపడి తరుముంది. అతను చేసిన చిన్న పొరపాటుతో చివరికి ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ శాంతాక్లాజ్ (Santa Claus) వేషధారి అందరికీ బహుమతులు పంచుతూ ఓ ఇంటి వెనుక ఉన్న మేక వద్దకు వెళ్తాడు. కవర్లో ఆకులు తీసుకెళ్లి మేకకు పెట్టకుండా దూరంగా వెళ్తాడు. దీన్ని గమనించిన మేక తీవ్ర ఆగ్రహంతో (Goat attack on man) అతన్ని వెంటపడుతుంది. మేక దాడి చేయడంతో అతను భయంతో పరిగెత్తి ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాక్కుంటాడు. అయినా మేక మాత్రం అతన్ని వదలకుండా డ్రమ్ము వద్దకు వెళ్లి అతను బయటికి వచ్చే వరకు కొమ్ములతో పొడుస్తుంది. దీంతో డ్రమ్ము నుంచి బయటికి వచ్చిన అతను.. భయంతో దూరంగా పారిపోతాడు.

Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకున్నాడో.. కోతికి ఆహారం తినిపిస్తూ.. ఇతడు ఏం చేశాడో చూస్తే..

అతను ఎంత తప్పించుకోవాలని చూసినా మేక మాత్రం అతని వెంటపడుతూనే ఉంటుంది. దాని నుంచి దూరంగా వెళ్లే క్రమంలో సమీపానికి వచ్చిన మేక.. అతన్ని వెనుక నుంచి గట్టిగా ఢీకొడుతుంది. దీంతో అతను బోర్లాపడిపోతాడు. చివరకు యజమాని వచ్చి మేకను పట్టుకుని పక్కకు తీసుకెళ్తాడు. దీంతో శాంతాక్లాజ్ వేషధారి హమ్మయ్య..! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘చాక్లెట్లు కాకుండా ఆకులు తెచ్చాడని.. ఈ మేకకు కోపం వచ్చినట్లుంది’’.. అంటూ కొందరు, ‘‘రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందేమో’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: రైల్లో ఆకతాయిలకు పాఠాలు నేర్పిస్తున్న కుక్క.. స్టేషన్‌లో ఎలా డ్యూటీ చేస్తుందో చూడండి..

Updated Date - Dec 31 , 2023 | 06:49 PM