Share News

Viral Video: వామ్మో! బీరు తయారీలో ఇలాక్కూడా చేస్తారా.. ఈ కంపెనీ సిబ్బంది దొంగచాటుగా ఏం చేస్తున్నారో చూడండి..

ABN , First Publish Date - 2023-10-24T15:39:45+05:30 IST

కొందరు తమ వృత్తే దైవంగా భావిస్తూ మెరుగైన సేవలందించడమే కాకుండా తక్కువ సమయంలోనే ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదిస్తుంటారు. అదేవిధంగా నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకెళ్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం..

Viral Video: వామ్మో! బీరు తయారీలో ఇలాక్కూడా చేస్తారా.. ఈ కంపెనీ సిబ్బంది దొంగచాటుగా ఏం చేస్తున్నారో చూడండి..

కొందరు తమ వృత్తే దైవంగా భావిస్తూ మెరుగైన సేవలందించడమే కాకుండా తక్కువ సమయంలోనే ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదిస్తుంటారు. అదేవిధంగా నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకెళ్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఆదాయమే పరమాధిగా భావిస్తూ నాణ్యతను గాలికొదిలేస్తుంటారు. ఇక మరికొందరైతే మరింత దారుణంగా ప్రవర్తిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. వివిధ రకాల తిరుతిళ్లు, హోటళ్లు తదితరాల్లో పరిశుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. బీరు కంపెనీలో ఓ వ్యక్తి దొంగచాటుగా చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. చైనాలోని చైనాలోని (China) షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని పింగ్డు సిటీలో ఉన్న బీరు ఫ్యాక్టరీలో (Beer factory) ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. బీరు తయారీ కోసం ఈ కంపెనీలో పెద్ద పెద్ద కంటైనర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇందులోని సిబ్బంది నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. రోజూలాగే విధులకు వెళ్లిన సిబ్బంది బీరు తయారీలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ సమయంలో యూనిఫామ్ ధరించిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి కంటైనర్ చాటుకు వెళ్లాడు. పక్కన ఎవరూ లేని సమయంలో చూసి ట్యాంకులోనే (urination) మూత్రవిసర్జన చేశాడు.

Viral Video: బస్సు నడుపుతూనే రోడ్డు పక్కన మహిళను గమనించిన డ్రైవర్.. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ఘోరమే జరిగేది..

తర్వాత ఏమీ తెలీనట్లు అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! బీరు కంనెనీలో ఇలాంటి పనులు కూడా చేస్తారా’’.. అంటూ కొందరు, ‘‘ ఈ వీడియో చూశాక.. బీర్లు తాగేవారు కొంచెం ఆలోచిస్తారేమో’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Shocking: ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. లోపలి నుంచి తాళం పెట్టి ఉందని గుర్తించిన స్థానికులు.. పోలీసులు తలుపులను పగలగొట్టి చూస్తే..!

Updated Date - 2023-10-24T15:39:45+05:30 IST