Viral Video: కారులో వెళ్తున్న వారికి షాక్ ఇచ్చిన జింక.. అది తింటున్నది పచ్చ గడ్డి అనుకున్నారు.. కానీ తీరా చూస్తే వామ్మో..

ABN , First Publish Date - 2023-07-14T18:12:21+05:30 IST

పులులు, సింహాలు తదితర క్రూర జంతువులకు.. మేకలు, జింకలు, జిరాఫీలు, అడవి దున్న వంటి జంతువులు ఆహారమనే విషయం తెలిసిందే. మరి జింకలు, మేకలకు ఆహారం ఏంటని అడిగితే.. ఇదేం పిచ్చి ప్రశ్న అని అంటారు కదా. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే..

Viral Video: కారులో వెళ్తున్న వారికి షాక్ ఇచ్చిన జింక.. అది తింటున్నది పచ్చ గడ్డి అనుకున్నారు.. కానీ తీరా చూస్తే వామ్మో..

పులులు, సింహాలు తదితర క్రూర జంతువులకు.. మేకలు, జింకలు, జిరాఫీలు, అడవి దున్న వంటి జంతువులు ఆహారమనే విషయం తెలిసిందే. మరి జింకలు, మేకలకు ఆహారం ఏంటని అడిగితే.. ఇదేం పిచ్చి ప్రశ్న అని అంటారు కదా. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. మీరే షాక్ అవుతారు. కారులో వెళ్తున్న వారికి రోడ్డు పక్కన ఉన్న జింక పెద్ద షాక్ ఇచ్చింది. పచ్చ గడ్డి తింటోందేమో అని ముందు అంతా అనుకున్నారు. కానీ చివరకు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు కారులో వెళ్తుండగా.. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ జింక ఏదో తింటున్నట్లు కనిపించింది. మొదట పచ్చ గడ్డి తింటోందని అంతా అనుకున్నారు. కానీ సమీపానికి రాగానే వారికి అనుమానం కలిగింది. దీంతో కారు ఆపి వీడియో తీశారు. కెమెరా జూమ్ చేసి చూడగా.. ఓ పెద్ద పామును జింక చెరుకు గడను నమిలేసినట్లు (deer eating a snake) తింటుండడం చూసి అంతా షాక్ అయ్యారు. పాము తల భాగాన్ని నోట్లో పెట్టుకున్న జింక.. క్రమ క్రమంగా పాము మొత్తాన్ని తినడం చూసి.. ఇది కలనా నిజమా అనుకుంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.

Viral Video: ఎక్కడి నుంచి వస్తాయి తల్లీ ఇలాంటి ఐడియాలు.. టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా..!?

సాధారణంగా గడ్డి, ఆకులు తినే జింక.. అందుకు విరుద్ధంగా పామును తినడం చూసి వారంతా అలాగే చూస్తుండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను సామ్రాట్ గౌడ అనే ఫారెస్ట్ ఆఫీసర్.. (Forest Officer) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘యమ్మీ క్రంచీ స్నాక్స్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఇంతకీ.. జింక శాఖాహారా.. లేక మాంసాహారా’’.. అని కొందరు, ‘‘బహుశా ఈ జింక మాంసాహారి అయ్యుండొచ్చు’’.. అని మరికొందరు, ‘‘చల్లటి సాయంత్ర వేళ స్నాక్స్ తింటున్న జింక’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!

Updated Date - 2023-07-14T18:17:03+05:30 IST