Share News

Viral Video: ఈ గోల్డెన్ హార్స్‌పై స్వారీ చేయడం అంత ఈజీ కాదు.. దీని ప్రత్యేకత, ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-11-28T19:01:05+05:30 IST

గుర్రపు స్వారీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అందులోనూ అందమైన గుర్రంపై స్వారీ అంటే.. అంతకు మించిన థ్రిల్ మరేదీ ఉండదు. కొన్ని గుర్రాలు ఎత్తు, పొడవుతో చూపరులు ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి..

Viral Video: ఈ గోల్డెన్ హార్స్‌పై స్వారీ చేయడం అంత ఈజీ కాదు.. దీని ప్రత్యేకత, ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే..

గుర్రపు స్వారీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అందులోనూ అందమైన గుర్రంపై స్వారీ అంటే.. అంతకు మించిన థ్రిల్ మరేదీ ఉండదు. కొన్ని గుర్రాలు ఎత్తు, పొడవుతో చూపరులు ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి అందమైన గుర్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత అందమైన గుర్రాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది గుర్రమా.. లేక అందమైన బొమ్మనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. గోల్డెన్ హార్స్ అని పిలువబడే ఈ గుర్రం చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. గోల్డెన్ హార్స్ అని పిలువబడే ఓ గుర్రాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. అఖల్-టేకే తుర్క్‌మెన్ అనే జాతికి చెందిన ఈ గుర్రాలు.. తుర్క్‌మెనిస్తాన్‌లోని (Turkmenistan) కురాకుమ్ ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బంగారు, వెండి రంగులో ధగధగా మెరిసిపోతూ (Golden and silver colored horses) కనిపించడం వీటి ప్రత్యేకత. ఈ గుర్రాలను అక్కడ గోల్డెన్ హార్స్ అని పిలుస్తుంటారు. ఈ జాతి గుర్రాలు పూర్వం అరేబియా జాతి గుర్రాల నుంచి ఉద్భవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇవి ఎంతో చురుకుదనంతో ఉండడంతో పాటూ మంచి శరీరాకృతిని కలిగి ఉంటాయి. వీటి జుట్టు వెండి వర్ణంలో మెరిసిపోతుండడంతో చూడటానికి ఆకర్షీయంగా ఉంటుంది.

Death Mystery: అయ్యా.. ఎవరో కారులో వచ్చి ఇద్దరి మృతదేహాలకు నిప్పంటించారంటూ పోలీసులకు ఫోన్.. వెళ్లి చూస్తే..!

ఈ గుర్రాలకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. ఎంతో విధేయతగా ఉండే ఈ గుర్రాలు.. తమ యజమానులను తప్ప మిగతా వారిని స్వారీకి అనుమతించవు. ప్రపంచంలోనే ఈ జాతి గుర్రాలు 7,000 మాత్రమే ఉన్నాయి. ఈ గుర్రం సుమారు రూ.30లక్షల వరకు ధర పలుకుతుంది. అష్కాబాద్ నగరంలో 1924లో చోటు చేసుకున్న భూకంపాల కారణంగా ఈ జాతి గుర్రాలు చాలా మృత్యువాత పడ్డాయి. అలాగే అనంతర కాలంలో వీటి మాంసం కోసం ఎక్కువగా చంపేచడం వల్ల కూడా ముప్పు వాటిళ్లింది. ప్రస్తుతం వీటిని జాతీయ జంతువులుగా ప్రకటించారు. ఇదిలావుండగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ గుర్రం బంగారు, వెండి వర్ణంలో మెరిసిపోతూ కనిపించింది. ఈ గుర్రాన్ని చూసిన నెటిజన్లు ‘‘వావ్! ఈ గుర్రం ఎంత అందంగా ఉంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Homemade Geyser: వేలకు వేలు పెట్టి గీజర్లు కొనలేక.. ఇంట్లోనే ఎలా తయారు చేశారో మీరే చూడండి..!

Updated Date - 2023-11-28T19:01:06+05:30 IST