Viral News: భర్తకు విడాకులిచ్చి రెండేళ్లయింది.. యువతితో సహజీవనం చేస్తూ తల్లైన మహిళ.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-05-28T12:06:29+05:30 IST
ఆమె పేరు లిండా ఫ్రూట్స్. ఆమె భర్త క్రిస్టోఫర్ హేర్టింగ్. ఎనిమిదేళ్ల క్రితం ఈ దంపతులకు వివాహమైంది.
Viral News: ఆమె పేరు లిండా ఫ్రూట్స్. ఆమె భర్త క్రిస్టోఫర్ హేర్టింగ్. ఎనిమిదేళ్ల క్రితం ఈ దంపతులకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్లోరిడాలోని (Florida) సన్‌రైజ్ ప్రాంతంలో నివాసం. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ, ఉన్నట్టుండి లిండా ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను దూరం పెట్టింది. అలా వారిద్దరూ ఏడాది పాటు సంసార జీవితానికి దూరంగా ఉన్నారు. దాంతో 2021 ఆగస్టులో లిండా భర్తతో విడిపోయింది. పురుషులతో శృంగారంపై తనకు పూర్తిగా ఇష్టం పోవడం, మరో స్త్రీ తోడు కావాలనిపిస్తుండడంతో తాను లెస్బియన్ (Lesbian) అని నిర్ధారించుకుంది. అందుకే భర్త నుంచి విడాకులు తీసుకుని బయటకు వచ్చేసింది.
ఈ క్రమంలో ఆమెకు మ్యాడ్డీ గ్రాస్ పరిచయమైంది. ఆమెనే తన గర్ల్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంది. అలా 2021 నవంబర్ నుంచి లిండా, మ్యాడ్డీ రిలేషన్ మొదలైంది. ఇక మాజీ భర్త క్రిస్టోఫర్‌తో కలిగిన ఇద్దరు పిల్లలను సైతం తనతోనే ఉంచుకుంది లిండా. ప్రస్తుతం లిండా, మ్యాడ్డీతో పాటు ఆ ఇద్దరు పిల్లలు కూడా వారితోనే ఉంటున్నారు. అయితే, మ్యాడ్డీ ఓ రోజు లిండాతో ఒక విషయం చెప్పింది. తాను ఓ బిడ్డకు తల్లి కావాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టింది.
Housewife: వామ్మో.. ఇలాంటి భార్యలు ఉన్న భర్తలకు ఎన్ని కోట్ల ఆస్తి ఉండాలో.. ఒక్క రోజులో రూ.73 లక్షలు షాపింగ్ చేసిందట..!
దాంతో లిండాకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే తన మాజీ భర్తను వెళ్లి కలిసింది. అతడితో మ్యాడ్డీ కోరిక గురించి చెప్పింది. ఆ తర్వాత స్పెర్మ్ (Sperm) డొనేట్ చేయాలని కోరింది. దానికి క్రిస్టోఫర్ సరే అన్నాడు. అలా అతడి స్పెర్మ్‌తో మ్యాడ్డీ గర్భం దాల్చింది. ఆ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం క్రిస్టోఫర్ ఇంట్లోనే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉంటోంది లిండా. మ్యాడ్డీ ద్వారా తమ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి చేరడం ఎంతో ఆనందంగా ఉందని లిండా తెలిపింది.