Viral Video: సింహం ముందే దూడను కొమ్ములతో ఎత్తిపడేసిన తల్లి గేదె.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-07-25T21:46:27+05:30 IST

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. తమ పిల్లలకు ఇబ్బంది జరుగుతుందంటే.. చివరకు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. ఈ క్రమంలో ఎవరినైనా ఎదిరించేందుకు వెనుకాడదు. ఇందుకు నిదర్శంగా..

Viral Video:  సింహం ముందే దూడను కొమ్ములతో ఎత్తిపడేసిన తల్లి గేదె.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా.. తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. తమ పిల్లలకు ఇబ్బంది జరుగుతుందంటే.. చివరకు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కాపాడుకుంటుంది. ఈ క్రమంలో ఎవరినైనా ఎదిరించేందుకు వెనుకాడదు. ఇందుకు నిదర్శంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరోవైపు సోషల్ మీడియలోనూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ తల్లి గేదెకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ దూడను పట్టుకున్న సింహం తినబోతూ ఉంటుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి తల్లి గేదె అక్కడికి వస్తుంది. ఈ క్రమంలో తన దూడను ఎలా కాపాడుకుందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద సింహం దూడను (Lion attack on calf) పట్టుకుని లాక్కెళ్తుంది. తీరా దాన్ని తినే సమయంలో తల్లి గేదె గమనిస్తుంది. తన దూడపై సింహం దాడి చేయడాన్ని చూసి విలవిల్లాడిపోతుంది. ఎలాగైనా తన దూడను కాపాడుకోవాలని ప్రాణాలకు తెగించి సింహంతో పోటీకి సిద్ధపడుతుంది. ఈ క్రమంలో తల్లి గేదెకు సాయంగా మరిన్ని గేదెలు (Buffaloes) వెనుకే వెళ్తాయి. సింహం తినబోతుండగా.. ఆవేశంగా దగ్గరికి వెళ్తుంది. గేదె ఆవేశాన్ని చూడగానే అంత పెద్ద సింహం.. ఒక్కసారిగా వెనక్కు తగ్గుతుంది.

Lift: కష్టపడకుండానే కోట్లు సంపాదించాలి.. ఇదీ ఈ దంపతుల ప్లాన్.. నడిరోడ్డుపై భార్యను ఒంటరిగా వదిలేసి భర్త పక్కా స్కెచ్..!

సింహంపై దాడి చేయకుండా ముందు తన దూడను (buffalo saved the calf) కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంది. కొమ్ములతో దూడను పైకి ఎత్తి.. సింహానికి దూరంగా వెనుక వైపునకు విరిరేస్తుంది. గేదెల మందను చూసిన సింహం భయంతో వణికిపోతుంది. ‘‘ఏమాత్రం ఆవేశపడ్డా.. మొదటికే మోసం వస్తుంది’’.. అని అనుకుందో ఏమో గానీ, మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: హైకోర్టు ముందుకు అరుదైన కేసు.. మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాక.. ఆ భార్య చేసిన నిర్వాకంతో..!

Updated Date - 2023-07-25T21:46:27+05:30 IST