Viral Video: జోరువానలో ఈ ప్రేమ జంట చేస్తున్న పనిని సీక్రెట్‌గా రికార్డ్ చేశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్..!
ABN , First Publish Date - 2023-06-28T18:02:27+05:30 IST
వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని ఎంతోమంది ఎంతలా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఎండలతో విసిగివేసారి ఉన్న వారంతా వర్షం పడగానే ఒక్కసారిగా రిలీఫ్ అవుతారు. ఈ క్రమంలో కొందరు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తే.. మరికొందరు తమకి ఇష్టమైన వేడి వేడి ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. మరికొందరు...
వర్షాకాల సీజన్ ప్రారంభాన్ని ఎంతోమంది ఎంతలా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఎండలతో విసిగివేసారి ఉన్న వారంతా వర్షం పడగానే ఒక్కసారిగా రిలీఫ్ అవుతారు. ఈ క్రమంలో కొందరు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తే.. మరికొందరు తమకి ఇష్టమైన వేడి వేడి ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి వర్షంలో గెంతులేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం జోరు వానలో ఓ ప్రేమ జంట నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
సోషల్ మీడియాలో ప్రేమ జంటకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. జోరు వాన కురుస్తున్న సమయంలో రద్దీగా ఉన్న రోడ్డుపై చోటు చేసుకున్న ఘటనతో అంతా అవాక్కయ్యారు. ఓ వైపు వర్షం పడుతుండగా.. మరోవైపు వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ఓ ప్రేమజంట సడన్‌గా రోడ్డుపైకి వస్తుంది. రోడ్డుకు ఓ వైపు వెళ్లి వర్షాన్ని కాసేపు ఎంజాయ్ చేస్తారు. తన్వయత్వంతో వెంటనే ఇద్దరూ (Lovers dancing on the road in the rain) డాన్స్ వేయడం మొదలెడతారు. పక్కన వాహనాలు, జనం ఉన్నారనే విషయం మర్చిపోయి.. వర్షంలో మైమరచిపోయి సినిమా తరహాలో స్టెప్పులు వేస్తారు.
అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కై.. వారినే చూస్తూ ఉండిపోతారు. ప్రేమ జంట డాన్స్ చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్లో ‘‘తూ హై తో ముఝే ఫిర్ ఔర్ క్యా చాహియే...’’ పాట ప్లే అవుతుంటుంది. ప్రపంచంతో మాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా వారిద్దరూ వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమజంట డాన్స్ వేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఈ ప్రేమ జంట డాన్స్ సూపర్’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డుపై ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.. అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.