Share News

Earthquake Under Sea: మునుపెన్నడూ చూడని అద్భుత దృశ్యం.. సముద్ర గర్భంలో భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూడండి..!

ABN , First Publish Date - 2023-11-15T16:02:11+05:30 IST

ప్రశాంతంగా ఉండే ప్రకృతి చూసేందుకు ఎంత బాగుంటుందో.. విధ్వంసం సృష్టిస్తే అంతే భయంకరంగా ఉంటుంది. ఉన్నట్టుండి చోటు చేసుకునే ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసువడం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా సునామీలు, భూకంపాలు చూసేందుకు ఎంత...

Earthquake Under Sea: మునుపెన్నడూ చూడని అద్భుత దృశ్యం.. సముద్ర గర్భంలో భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూడండి..!

ప్రశాంతంగా ఉండే ప్రకృతి చూసేందుకు ఎంత బాగుంటుందో.. విధ్వంసం సృష్టిస్తే అంతే భయంకరంగా ఉంటుంది. ఉన్నట్టుండి చోటు చేసుకునే ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసువడం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా సునామీలు, భూకంపాలు చూసేందుకు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే సముద్ర గర్భంలో భూకంపం సంభవిస్తే ఎలా ఉంటుందనేది ఊహకందనివిధంగా ఉంటుంది. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సముద్ర గర్భంలో సంభవించిన భూకంపానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇండోనేషియా (Indonesia) మలుకు దీవుల్లోని బండా సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొందరు డైవర్లకు సముద్రంలో ఊహించని అనుభవం ఎదురైంది. స్కూబా డైవింగ్ (Scuba diving) చేస్తున్న వారు.. సముద్ర గర్భంలో చేపల మధ్య అందాలను వీక్షిస్తూ, తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఇలా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి మొదలవుతుంది. భూకంపం సంభవించడంతో (Earthquake under the sea) ఆ ప్రాంతం మొత్తం వణికిపోతుంది. దీంతో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా గందరగోళంగా మారుతుంది.

Marriage Video: కారులో రావాల్సిన వరుడిని సడన్‌గా ఇలా చూసి అవాక్కైన బంధువులు.. పెళ్లికి ముందే ముచ్చట తీర్చుకున్నాడుగా..!

సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో అర్థం కాక డైవర్లు భయపడిపోయి అంతా ఓ చోటికి చేరుకుంటారు. తేటగా ఉన్న నీరు కాస్త మురికిగా మారడంతో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంటుంది. ఈ ఘటనను మొత్తం వారు తమ కెమెరాల్లో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయంగా ఉంది బాబాయ్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దృశ్యం మొదటిసారి చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral News: పెంపుడు కుక్క ప్రసవించిందని ఊరంతా భోజనాలు పెట్టించిన యజమాని.. మేళతాళాలు.. బ్యాండ్ బాజాలతో డాన్సులు..!

Updated Date - 2023-11-15T16:02:14+05:30 IST