Viral Video: ఒడ్డున ఉన్న చేపపై దాడి చేసిన మొసలి.. తీరా నోట కరుచుకోగానే ఊహించని షాక్.. చివరికి ఏమైందో చూడండి..

ABN , First Publish Date - 2023-09-14T21:52:04+05:30 IST

మొసలి ఒక్కసారి దాడి చేసిందంటే.. అవతల ఉన్నది ఎలాంటి జంతువైనా దాదాపు ఆహారమైపోవాల్సిందే. ఇక నీటిలో మొసలి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇక మొసలి బారిన పడే చేపల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంతా చెప్పాల్సిన పని లేదు. అయితే..

Viral Video: ఒడ్డున ఉన్న చేపపై దాడి చేసిన మొసలి.. తీరా నోట కరుచుకోగానే ఊహించని షాక్.. చివరికి ఏమైందో చూడండి..

మొసలి ఒక్కసారి దాడి చేసిందంటే.. అవతల ఉన్నది ఎలాంటి జంతువైనా దాదాపు ఆహారమైపోవాల్సిందే. ఇక నీటిలో మొసలి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. ఇక మొసలి బారిన పడే చేపల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంతా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఒడ్డున ఉన్న చేపపై ఓ మొసలి దాడి చేసింది. అయితే తీరా నోట కరుచుకోగానే మొసలికి ఊహించని షాక్ తగిలింది. చివరకు ఏమైందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ నది ఒడ్డున కొన్ని చేపలు అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తాయి. వీటిని టార్గెట్ చేసిన ఓ మొసలి మెల్లగా దగ్గరికి వస్తుంది. దీంతో అక్కడున్న చేపలన్నీ పారిపోతాయి. అయితే వాటిలో ఓ చేప మాత్రం మొసలికి దొరికిపోతుంది. చేపను మొసలి నోట కరుచుకోగానే వెంటనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అది ఎలక్ట్రిక్ ఈల్ చేప (electric eel fish) అనే విషయం తెలీని మొసలి.. తినేద్దామని గట్టిగా పట్టుకుటుంది.

Chennai Grandma: ఒకప్పుడు ఇంగ్లీషు టీచర్.. ఇప్పుడు రోడ్డు పక్కన అనాథలా.. ఆమెను ఓ కుర్రాడు గుర్తు పట్టి..!

స్వతహాగానే తమ మీద దాడి చేసే శత్రువును కరెంట్ షాక్‌తో చంపేసే ఈల్ చేప.. మొసలి పట్టుకోగానే వెంటనే పవర్ రిలీజ్ చేస్తుంది. దీంతో మొసలి గిలాగిలా కొట్టుకుంటుంది. ఇలా చాలా సేపు గిలాగిలా కొట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోతుంది. అయితే ఈ ఘటనలో మొసలి నోట్లో పడి చేప కూడా చనిపోతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఈ చేపలను చూస్తేంటే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘మొసలి స్థానంలో మనిషి ఉండుంటే పరిస్థితి ఏంటి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking: ఈ చేపలను తిని 32 ఏళ్ల మహిళ మృతి.. మరో 12 మంది పరిస్థితి విషమం.. ఇంతకీ ఇవేం చేపలంటే..!

Updated Date - 2023-09-14T21:52:04+05:30 IST