Viral Video: వామ్మో! కొండచిలువను చూసి అంతా భయపడుతుంటే.. ఇతనేంటీ మరీ ఇలా చేశాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-04-30T17:52:07+05:30 IST

చిన్న చిన్న పాములను చూస్తేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది ఇక పెద్ద పాములు, కొండచిలువలు ఎదురుగా వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని అనిపిస్తుంది కదా. కానీ..

Viral Video: వామ్మో! కొండచిలువను చూసి అంతా భయపడుతుంటే.. ఇతనేంటీ మరీ ఇలా చేశాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

చిన్న చిన్న పాములను చూస్తేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది ఇక పెద్ద పాములు, కొండచిలువలు ఎదురుగా వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే అని అనిపిస్తుంది కదా. కానీ కొందరు మాత్రం చాలా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు. పెద్ద పెద్ద పాములు, కొండచిలువలతో ఆటలు ఆడుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పెద్ద కొండచిలువను చూసి అంతా భయపడుతుంటే.. ఓ వ్యక్తి మాత్రం దాన్ని తలపట్టుకుని మరీ చుట్ట చుట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. కొందరు పర్యాటకులు ఓ అడవిలో (Tourists in the forest) సంచరిస్తూ ఉంటారు. అడవిలోని అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కొండచిలువ (Large python) వారికి ఎదురుగా వస్తుంది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడి పరుగులు పెడతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం అందుకు విరుద్ధంగా కొండచిలువను వెంటపడతాడు. పొదల్లోకి వెళ్తున్న కొండచిలువను చాకచక్యంగా తల పట్టుకుని బయటికి తెస్తాడు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

ఈ క్రమంలో కొండచిలువ అతన్ని చుట్టేసి చంపేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సదరు వ్యక్తి మాత్రం తెలివిగా.. తలను వదలకుండా మధ్య మధ్యలో దాన్ని పక్కకు నెడుతూ ఉంటాడు. చివరకు అంత పెద్ద కొండచిలువను చుట్టలా చుట్టేస్తాడు. దాని మీద కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత దాన్ని అడవిలోకి వదిలిపెడతాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడికి ఎంత ధైర్యం’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: వాంతి వస్తుండడంతో కారు ఆపిన వరుడు.. వెంటనే వాహనం దిగి కేకలు పెట్టిన వధువు.. చివరకు ఆమె తండ్రి వచ్చి అసలు విషయం చెప్పడంతో..

Updated Date - 2023-04-30T17:52:07+05:30 IST