Share News

Viral News: రాత్రి 2.30 గంటల సమయం.. షాపింగ్‌ మాల్‌లో ఒంటరిగా కనిపించిన యువతి.. సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి అడగ్గానే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-10-16T16:40:35+05:30 IST

కొన్ని సినిమాలు చూసిన తరువాత వాటి తాలుకూ సంఘటనలు, అందులో పాత్రల ప్రభావం నుండి అంత సులువుగా బయటకు రాలేరు. ఈమె చేసిన పని చూస్తే ఈమె కూడా ఇంతేనేమో అనిపిస్తుంది.

Viral News: రాత్రి 2.30 గంటల సమయం.. షాపింగ్‌ మాల్‌లో ఒంటరిగా కనిపించిన యువతి.. సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి అడగ్గానే షాకింగ్ ట్విస్ట్..!

సినిమాల ప్రభావం ప్రజలమీద ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సినిమాలు చూసిన తరువాత వాటి తాలుకూ సంఘటనలు, అందులో పాత్రల ప్రభావం నుండి అంత సులువుగా బయటకు రాలేరు. మంచి సినిమాలు, మనసుకు ఆహ్లాదం కలిగించే సినిమాలు అయితే హాయిగా, మనసు తేలికగా ఉంటుంది. కానీ డిస్టర్బ్ చేసే సినిమాలు చూస్తే మాత్రం ఆ సినిమా వల్ల తాము డిస్టర్బ్ అవ్వడమే కాకుండా ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తారు. బెంగుళూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 10గంటల షోకు వెళ్లిన తరువాత జరిగిన పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ మహిళకు సంబంధించి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

బెంగళూరు(Bengaluru) నగరానికి చెందిన 28ఏళ్ళ మహిళ చార్టర్ అకౌంటెంట్(chartered accountant) గా పనిచేస్తోంది. ఈమె బెంగుళూరులోని కోరమంగళలో ఉన్న పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నివసిస్తోంది. స్థానికంగా ఉన్న నెక్సస్ మాల్(nexus mall) కు ది నన్-2(THE NUN-2) అనే హర్రర్ సినిమా చూడటానికి వెళ్లింది. రాత్రి 10.30గంటలకు వెళ్లిన ఈమె సినిమా పూర్తైనా మాల్ లో నుండి బయటకు వెళ్ళలేదు. మాల్ లో ఒంటరిగా తిరుగుతున్న ఆమెను బయటకు వెళ్లాల్సిందిగా మాల్ సిబ్బంది కోరారు కానీ ఆమె వారి మాట వినలేదు. ఆ తరువాత మాల్ మేనేజర్ కూడా ఆమె దగ్గరకు బయటకు వెళ్లాలని కోరాడు కానీ ఆమె మాల్ మేనేజర్ ను, అక్కడి సిబ్బందిని దుర్బాషలాడింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు కలుగజేసుకుని ఆమెను బయటకు వెళ్లాల్సిందిగా కోరారు. కానీ ఆమె సెక్యూరిటీ సిబ్బంది మీద దాడి చేసింది. కొందరిని కొరికింది. దీంతో మాల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి తమ సమస్య వివరించారు. అదే సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న మహిళా సబ్ ఇన్పెక్టర్ వారి ఫోన్ కాల్ కు స్పందించి ఆ మహిళను తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది.

Travelers: తరచూ ప్రయాణాలు చేసే అలవాటు ఉన్న వాళ్లు.. ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు మర్చిపోరట..!



మహిళా సబ్ఇన్పెక్టర్ ఆమెను తీసుకెళుతున్నప్పుడు ఆమెను కూడా ఆ మహిళ కొరికింది. తన కాలికి ఉన్న షూను తీసి ఏఎస్ఐ పై విసిరింది. పోలీసులను చాలా దారుణంగా తిట్టింది. చివరికి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353, 323, 324, 504 కింద విధులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, వారిమీద దాడిచేయడం, గాయపరచడం, ఆయుధాలు లేదా సాధారణంగా గాయపరచడం వంటి కారణాల వల్ల పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.

Viral News: ఈ ఫొటోలోని యువతి తండ్రికి ఏకంగా రూ.24,980 కోట్ల ఆస్తి.. అయినా ఈమె ప్రస్తుతం ఏం చేస్తోందో తెలిస్తే..!


Updated Date - 2023-10-16T16:40:35+05:30 IST